Supreme Court: ఆ వాహనాలకు రోడ్‌ ట్యాక్స్ ఉండదు.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు

భారత్‌లో వాహనాలు పబ్లిక్ రోడ్లపై నడాపాలంటే రోడ్‌ ట్యాక్స్ కట్టాల్సి ఉంటుందన్న సంగతి తెలిసిందే. తాజాగా దీనిపై సుప్రీంకోర్టు సంచలన తీర్పునిచ్చింది. పబ్లిక్‌ ప్లేస్‌లో వాడని వాహనాలపై ఎలాంటి రోడ్ ట్యాక్స్ లేదా మోటార్ వెహికిల్ ట్యాక్స్ వేయకూడదని పేర్కొంది.

New Update
Supreme Court

Supreme Court

భారత్‌లో వాహనాలు పబ్లిక్ రోడ్లపై నడాపాలంటే రోడ్‌ ట్యాక్స్ కట్టాల్సి ఉంటుందన్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా దీనిపై సుప్రీంకోర్టు సంచలన తీర్పునిచ్చింది. పబ్లిక్‌ ప్లేస్‌లో వాడని వాహనాలపై ఎలాంటి రోడ్ ట్యాక్స్ లేదా మోటార్ వెహికిల్ ట్యాక్స్ వేయకూడదని పేర్కొంది. అంటే కేవలం ఫ్యాక్టరీలు, ప్రైవేట్‌ ఎస్టేట్లు, క్యాంపస్‌ల వంటి సొంత ప్రాంతాల్లో వాహనాలు నడిపేవారికి ఈ తీర్పు వర్తించనుంది.   

Also Read: ఓట్ల చోరీపై హైడ్రోజన్‌ బాంబు పేలుస్తా.. రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు

జస్టిస్ మనోజ్ మిశ్రా, జస్టిస్ ఉజ్జల్ భూయాన్‌లతో కూడిన ధర్మాసనం దీనిపై వివరణ ఇచ్చింది. మోటార్ వెహికిల్ ట్యాక్స్ అనేది కాంపెన్సేటరీ ట్యాక్స్ అని పేర్కొంది. దీని అర్ధం ప్రభుత్వ రోడ్లు, హైవేలను వాడుతున్నందుకు ఫీజు కట్టడం. పబ్లిక్ రోడ్లను వాడితేనే ట్యాక్స్ కట్టాల్సి ఉంటుంది. ఒకవేళ వాహనం కేవలం ప్రైవేటు ప్రాంతాలకు మాత్రమే పరిమితమైతే మాత్రం ప్రభుత్వానికి ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదని సుప్రీం ధర్మాసనం స్పష్టం చేసింది.   

Also Read: కుంభమేళా మొనాలిసాకు మరో బంపర్ ఆఫర్.. సౌత్ స్టార్ హీరోతో సినిమా!

వాస్తవానికి జడ్జిలు ఈ తీర్పు కోసం ఏపీ మోటార్ వెహికిల్ ట్యాక్సెషన్ యాక్ట్, 1963లోని సెక్షన్ 3ను పరిశీలించారు. ఈ చట్టం ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం వాహనాలపై ట్యాక్స్ వేయచ్చు. అయితే ఈ చట్టంలో పబ్లిక్ ప్లేస్ అనే పదం చాలా ముఖ్యమని సుప్రీంకోర్టు పేర్కొంది. ఒక వెహికిల్‌ను పబ్లిక్‌ ప్రాంతంలో వాడినప్పుడు లేదా అక్కడ వాడేందుకు సిద్ధంగా ఉంచినప్పుడు మాత్రమే ట్యాక్స్‌ వేయాలని చట్టం చెబుతోందని స్పష్టం చేసింది. 

Also Read: ట్రంప్ తిక్క కుదిరింది.. విదేశీ విద్యార్థులు రాకపోవడంతో రూ.60 వేల కోట్ల నష్టం!

Also Read: డ్రాగన్, ఏనుగు మధ్య స్నేహం.. దీనివల్ల భారత్‌కు లాభమేంటి?

Advertisment
తాజా కథనాలు