Jharkhand Heavy Rains: ఝార్ఖండ్‌లో భారీ వరదలు.. చిక్కుకున్న 162 మంది విద్యార్థులు
ఝార్ఖండ్‌లోని సింగ్బూమ్ జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు ఓ ఆశ్రమ పాఠశాల మునిగింది. దాదాపుగా 162 విద్యార్థులు ఈ పాఠశాల భవనంలో చిక్కుకున్నారు. వెంటనే అధికారులు స్థానికుల సాయంతో వారిని రక్షించారు. కొన్ని ప్రాంతాల్లో కొండ చరియలు విరిగిపడ్డాయి.