Uttarakhand : ఉత్తరఖాండ్లో అక్రమ మదర్సా, మసీదు కూల్చివేత.. చెలరేగిన అల్లర్లు.. నలుగురు మృతి
ఉత్తరఖాండ్ హల్ద్వానిలో అక్రమంగా నిర్మించిన మదార్సా, మసీదును కూల్చివేయడంతో.. అక్కడి స్థానికులు హింసాత్మక ఘటనలకు పాల్పడ్డారు. వాహనాలకు, పోలీస్ స్టషన్కు నిప్పు పెట్టారు. ఈ దుర్ఘటనలో నలుగురు ప్రాణాలు కోల్పోగా.. వందమందికి పైగా పోలీస్ సిబ్బంది గాయాలపాలయ్యారు.