BIG BREAKING: వరదల్లో కొట్టుకుపోయిన ఆర్మీ క్యాంప్.. 10 మంది జవాన్లు మృతి?

ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశీలో క్లౌడ్ బరస్ట్ వల్ల ధరాలీ గ్రామం మొత్తం కొట్టుకునిపోయింది. ఈ గ్రామంలో వేసిన ఆర్మీ బేస్ క్యాంప్‌ కొట్టుకుని పోవడంతో పాటు ఇక్కడ ఉన్న 10 మంది జవాన్లు గల్లంతయ్యారు. ఎన్డీఆర్‌ఎఫ్, ఎస్‌డీఆర్‌ఎఫ్ బృందాలు సహాయక చర్యలు చేపట్టాయి

New Update
Uttarkhand

Uttarkhand Photograph: (Uttarkhand)

ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశీలో క్లౌడ్ బరస్ట్ వల్ల భారీ వరదలు సంభవించాయి. గంగోత్రీలోని ధరాలీ గ్రామాన్ని క్లౌడ్ బరస్ట్ ఒక్కసారిగా ఊడ్చుకుని వెళ్లిపోయింది. ఈ భారీ వరద వల్ల ఒక్కసారిగా గ్రామం మొత్తం కొట్టుకునిపోయింది. ఈ గ్రామంలో వేసిన ఆర్మీ బేస్ క్యాంప్‌ కొట్టుకుని పోవడంతో పాటు ఇక్కడ ఉన్న 10 మంది జవాన్లు గల్లంతయ్యారు. వీరి కోసం ఎన్డీఆర్‌ఎఫ్, ఎస్‌డీఆర్‌ఎఫ్ బృందాలు సహాయక చర్యలు చేపట్టాయి. జవాన్లు కోసం ప్రస్తుతం గాలిస్తున్నారు. 

బురద ఒక్కసారిగా కొట్టుకుని రావడంతో..

ఉత్తరకాశీలోని ఖీర్ గంగా నది విజృంభించడంతో ఈ క్లౌడ్‌ బరస్ట్‌ ఏర్పడింది. దీంతో ధరాలి గ్రామంపై ఒక్కసారిగా కొండ చరియలు విరిగిపడ్డాయి. దీనికి తోడు బురద ఒక్కసారిగా గ్రామంపై దూసుకెళ్లింది. ఈ బురద అకస్మాత్తుగా రావడంతో ఇళ్లు, హోటళ్లు ఇలా కొండకి ఆనుకుని ఉన్న అన్ని కూడా నేలమట్టమయ్యాయి. ఈ భారీ బురద వల్ల నలుగురు మృతి చెందినట్లు తెలుస్తోంది. దాదాపుగా వంద మందికి పైగా గల్లంతు అయినట్లు సమాచారం. కొందరు ఈ బురదలో చిక్కుకున్నట్లు తెలుస్తోంది. NDRF, SDRF బృందాలు సహాయక చర్యలు చేపట్టాయి. గల్లంతు అయిన వారిని కాపాడటానికి ప్రయత్నిస్తున్నాయి. 

ఇది కూడా చూడండి:Uttarakhand Cloud Burst: ఉత్తరాఖండ్ భారీ క్లౌడ్ బరస్ట్.. బురదకు కొట్టుకుపోయిన గ్రామం.. 50 మందికి పైగా?

ఇదిలా ఉండగా సాధారణంగా ఉత్తరాఖండ్‌లో ఎక్కువగా వర్షాలు పడుతుంటాయి. కొండ ప్రాంతం కావడంతో క్లౌడ్ బరస్ట్ కురిసింది. ఈ క్లౌడ్ బరస్ట్ అంటే తక్కువ కాలంలో కుంభవృష్టిలా వర్షాలు కురుస్తాయి. గత కొన్ని రోజుల నుంచి ఉత్తరాఖండ్‌లో వర్షాలు కురుస్తున్నాయి. ఆగకుండా కురుస్తున్న వర్షాలకు ప్రజలు ఇబ్బంది పడతుున్నారు. ఇళ్లు, భవనాలు నేలమట్టం కావడంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. అధికారుల సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోంది. 

Advertisment
తాజా కథనాలు