Urvashi Rautela: ఊర్వశి రౌతేలాకు బిగ్ షాక్.. రూ.70 లక్షల నగలు కొట్టేసిన దొంగలు
బాలీవుడ్ నటి ఊర్వశి రౌతేలాకు ఊహించని అనుభవం ఎదురైంది. లండన్ ఎయిర్పోర్ట్లో డియోర్ సూట్కేస్ దొంగిలించబడింది. అందులో తన నగలు ఉన్నాయని ఆమె వాపోయింది.
బాలీవుడ్ నటి ఊర్వశి రౌతేలాకు ఊహించని అనుభవం ఎదురైంది. లండన్ ఎయిర్పోర్ట్లో డియోర్ సూట్కేస్ దొంగిలించబడింది. అందులో తన నగలు ఉన్నాయని ఆమె వాపోయింది.
కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ 2025 రెడ్ కార్పెట్ పై ఊర్వశీ ధరించిన ప్యారెట్ ఆకారంలోని క్లచ్ బ్యాగ్ ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. క్రిస్టల్స్ తో అలంకరించబడిన ఈ బ్యాగ్ ధర సుమారు 4లక్షలు అని తెలిసింది. దీనికి ముద్దిస్తూ ఊర్వశీ దిగిన ఓఫొటో నెట్టింట వైరలవుతోంది.
బాలీవుడ్ బ్యూటీ ఊర్వశీ నెట్టింట మరో గ్లామరస్ ఫొటో షూట్ షేర్ చేసింది. ఫెరారీతో ఈ ముద్దుగుమ్మ ఫోజులు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఈ ఫొటోలపై మీరు ఓ లుక్కేయండి.
బాలయ్య బ్యూటీ ఊర్వశీ రౌతేలా ఆకుపచ్చ డ్రెస్ లో గ్లామరస్ ఫొటోషూట్ షేర్ చేసింది. ఆకర్షణీయమైన అందాలతో ఫాలోవర్లను ఫిదా చేస్తోంది బ్యూటీ. ఈ ఫొటోలను మీరు కూడా చూసేయండి.
బద్రీనాథ్ సమీపంలో తనపేరుతో గుడి ఉందని, అక్కడికి వెళ్లినప్పుడు అందరూ దర్శించుకోవాలని నటి ఊర్వశీ రౌతేలా చేసిన వ్యాఖ్యలు రచ్చలేపుతున్నాయి. ఉత్తరాఖండ్ పూజారీ భువన్ చంద్ర స్పందిస్తూ.. ఆమె వ్యాఖ్యలు అవాస్తం. ప్రభుత్వం ఆమెపై చర్యలు తీసుకోవాలి అని డిమాండ్ చేశారు.
నటి ఊర్వశీ రౌతేలా ఉత్తరాఖండ్ లో తన పేరుపై ఆలయం ఉందంటూ మరోసారి వార్తల్లో నిలిచింది. బద్రీనాథ్ కి వెళ్లేవారు పక్కనే ఉన్న తన ఆలయాన్ని కూడా సందర్శించాలని కోరింది. అంతేకాదు దక్షిణ భారతదేశంలోనూ తన పేరుపై ఒక ఆలయాన్ని నిర్మించాలని అన్నారు.
"డాకు మహారాజ్" చిత్రంలో తన నటనకు గానూ బాలీవుడ్ భామ ఊర్వశి రౌతేలాకు ఫ్యాన్స్ ఫేవరెట్ ఆర్టిస్ట్ ఆఫ్ ది ఇయర్ 2025 అవార్డు దక్కింది. అవార్డును పట్టుకున్న ఫోటోలను షేర్ చేస్తూ తనకు సప్పోర్ట్ చేసిన అభిమానులందరికి ధన్యవాదాలు తెలిపారు ఊర్వశి.
బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌతేలా ఎన్టీఆర్ తో కలిసి నటించే లక్కీ ఛాన్స్ కొట్టేసింది. ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ కాంబోలో రాబోతున్న మూవీ కోసం ఊర్వశి రౌతేలాను పరిశీలిస్తున్నారట మూవీ టీం. అదే నిజమైతే, ఊర్వశికు ఈ మూవీతో తెలుగులో మంచి బ్రేక్ రావడం పక్కా.
బాలయ్య 'డాకు మహారాజ్' నెట్ ఫ్లిక్స్ స్ట్రీమింగ్ డేట్ పోస్టర్ పై ఊర్వశీ పేరు లేకపోవడం వివాదానికి దారితీసింది. సినిమాలో ఓ కీలక పాత్ర పోషించిన ఊర్వశీ ఫొటో పోస్టర్ లో లేకపోవడం పై ఆమె ఫ్యాన్స్ మండిపడుతున్నారు.