Cannes Film Festival urvashi: ఊర్వశీ చేతిలోని ఆ ప్యారెట్ బ్యాగ్ ధర తెలిస్తే మతిపోతుంది.!

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ 2025 రెడ్ కార్పెట్ పై ఊర్వశీ ధరించిన ప్యారెట్ ఆకారంలోని క్లచ్ బ్యాగ్ ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. క్రిస్టల్స్ తో అలంకరించబడిన ఈ బ్యాగ్ ధర సుమారు 4లక్షలు అని తెలిసింది. దీనికి ముద్దిస్తూ ఊర్వశీ దిగిన ఓఫొటో నెట్టింట వైరలవుతోంది.

New Update
urvasi rautela at 78th cannes film festival

urvasi rautela at 78th cannes film festival

Cannes Film Festival urvashi:  బాలీవుడ్ బ్యూటీ ఊర్వశీ రౌతేలా మరోసారి తన స్టైల్ తో అందరినీ ఆశ్చర్యపరిచింది. కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ 2025 రెడ్ కార్పెట్ పై స్టన్నింగ్ లుక్ లో మెరిసింది. ఊర్వశీ ధరించిన ప్యారెట్ ఆకారంలోని క్లచ్ బ్యాగ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. దీని ధర తెలిసిన వారంతా నోరెళ్ళ బెడుతున్నారు. ఆమె చేతిలో ఉన్న ఈ క్లచ్ బ్యాగ్ పూర్తిగా క్రిస్టల్స్ తో అలంకరించబడి ఉంది. 

Also Read :  జియో మామ సూపరెహే.. రూ.100కే 90 రోజుల వ్యాలిడిటీ.. 5GB డేటా!

బ్యాగ్ ధర రూ. 4 లక్షలు

ఈ బ్యాగ్‌కి సంబంధించి  Diet Sabya అనే ఇన్‌స్టాగ్రామ్ పేజీలో  తెలిపిన వివరాల ప్రకారం..  ఈ క్లచ్ బ్యాగ్  ప్రముఖ బ్రాండ్ Judith Leiber కి చెందినది. దీని ధర సుమారు $5,495 అంటే  (రూ. 4,68,000)! ఓ ఫోటోలో ఊర్వశి ఆ బ్యాగ్ కి ముద్దిస్తూ దిగిన ఫొటో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. దీనిపై పై సోషల్ మీడియాలో నెటిజన్లు విభిన్న అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. కొందరు సూపర్, నైస్ అని కామెంట్స్ చేస్తుండగా.. మరికొందరు.. షాకవుతున్నారు. 

Also Read :  ‘అత్తా మీ కూతుర్ని చంపేశా’.. HYDలో భార్య గొంతు నులిమి, గాజుతో కోసి కిరాతకంగా చంపిన భర్త!

ఇదిలా ఉంటే 78వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ వేడుకలు ఫ్రాన్స్ వేదికగా అట్టహాసంగా మొదలయ్యాయి. ఈ నెల 24 వరకు సాగనున్న ఈ వేడుకల్లో హాలీవుడ్, బాలీవుడ్ కి చెందిన అందాల బామలు సందడి చేశారు. బాలీవుడ్ తారలు ఊర్వశీ, ఐశ్వర్య, జాన్వీ కపూర్  ప్రత్యేకమైన వస్త్రాధరణలో  రెడ్ కార్పెట్ పై అందరి దృష్టిని  ఆకర్షించారు. ఊర్వశీ నీలం, ఎరుపు, పసుపు రంగుల మిశ్రమంతో ఉన్న స్ట్రాప్‌లెస్ డ్రెస్, చేతిలో ప్యారెట్ ఆకారంలోని  క్లచ్ బ్యాగ్ తో  స్పెషల్ అట్రాక్షన్ గా మెరిసింది. 

telugu-news | cinema-news | Urvashi Rautela | 78th Cannes Film Festival 

ALSO READ: Single Movie Collections: ఈ రేంజ్ కలెక్షన్స్ అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదుగా! #సింగిల్ వరల్డ్ వైడ్ ఎంతంటే..?

Advertisment
Advertisment
తాజా కథనాలు