Urvashi Rautel: ఊర్వశీకి ఘోర అవమానం.. సోషల్ మీడియాలో నెట్ ఫ్లిక్స్ పై భారీ ట్రోలింగ్!

బాలయ్య 'డాకు మహారాజ్' నెట్ ఫ్లిక్స్ స్ట్రీమింగ్ డేట్ పోస్టర్ పై ఊర్వశీ పేరు లేకపోవడం వివాదానికి దారితీసింది. సినిమాలో ఓ కీలక పాత్ర పోషించిన ఊర్వశీ ఫొటో పోస్టర్ లో లేకపోవడం పై ఆమె ఫ్యాన్స్ మండిపడుతున్నారు.

New Update
Urvashi Rautela: ఆ బాత్‌రూమ్‌ వీడియో నాదే.. ఊర్వశి రౌతేలా రియాక్షన్..!

Urvashi Rautel

Urvashi Rautela: బాలీవుడ్ బ్యూటీ ఊర్వశీ రౌతేలా ఇటీవలే 'డాకు మహారాజ్' సినిమాతో తెలుగులో భారీ విజయాన్ని అందుకుంది. బాబీ- బాలయ్య కాంబోలో సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ యాక్షన్ ఎంటర్ టైనర్ బాక్స్ ఆఫీస్ వద్ద దుమ్మురేపింది. దాదాపు రూ. 100 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. ఇందులో ఊర్వశీ బాలయ్య సరసన పోలీస్ ఆఫీసర్ పాత్రలో, దబిడి దిబిడి సాంగ్ లో ఫ్యాన్స్ ని ఓ ఊపు ఊపేసింది. రీసెంట్ గా సక్సెస్ ఫుల్ థియేట్రికల్ రన్  పూర్తిచేసుకున్న ఈ చిత్రం.. ఇప్పుడు ఓటీటీలో సందడి చేసేందుకు సిద్ధమైంది. ఈనెల 21నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్నట్లు నెట్ ఫ్లిక్స్ వెల్లడించింది. 

Also Read: Lavanya: ఓవైపు రాజ్ ని ప్రేమిస్తూనే మస్తాన్ సాయితో బెడ్ రూమ్ లో.. లావణ్య గురించి ఫ్రెండ్ ప్రీతీ..

నెట్ ఫ్లిక్స్ పై ట్రోలింగ్ 

అయితే ఓటీటీ తేదీని ప్రకటిస్తూ నెట్ ఫ్లిక్స్ విడుదల చేసిన పోస్టర్ సోషల్ మీడియాలో వివాదానికి దారితీసింది.  'డాకు మహారాజ్' లో కీలక పాత్ర పోషించిన ఊర్వశీ ఫొటో పోస్టర్ లో లేకపోవడం పై ఆమె ఫ్యాన్స్ మండిపడుతున్నారు. సినిమాలో ఓ  కీలక పాత్ర పోషించిన ఊర్వశీకి ఇచ్చే గుర్తింపు ఇదేనా అంటూ  ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నెట్ ఫ్లిక్స్ పై ట్రోలింగ్ మొదలు పెట్టారు. దీంతో  ఇది గమనించిన నెట్ ఫ్లిక్స్  పోస్టర్ లో సవరణలు చేసి ... మళ్ళీ కొత్తది విడుదల చేసింది.   

సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చూన్‌ ఫోర్‌ బ్యానర్స్ పై సూర్యదేవర నాగవంశీ  ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇందులో ఊర్వశీతో పాటు శ్రద్దా శ్రీనాథ్‌, ప్రగ్య కూడా  ఫీమేల్ లీడ్స్ గా నటించారు. బాబీ డియోల్, చాందిని చౌదరీ కీలక పాత్రలు పోషించారు. 

Also Read: Rishab Shetty: ఫ్యాన్స్ కి గూస్ బంప్స్.. ఛత్రపతి శివాజీ మహారాజ్ గా రిషబ్ శెట్టి.. పోస్టర్ వైరల్

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు