Urvashi Rautela: ఊర్వశి రౌతేలాకు బిగ్ షాక్.. రూ.70 లక్షల నగలు కొట్టేసిన దొంగలు

బాలీవుడ్ నటి ఊర్వశి రౌతేలాకు ఊహించని అనుభవం ఎదురైంది. లండన్‌ ఎయిర్‌పోర్ట్‌లో  డియోర్ సూట్‌కేస్ దొంగిలించబడింది. అందులో తన నగలు ఉన్నాయని ఆమె వాపోయింది.

New Update
urvasi

Urvashi Rautela: బాలీవుడ్ నటి ఊర్వశి రౌతేలాకు ఊహించని అనుభవం ఎదురైంది. లండన్‌ ఎయిర్‌పోర్ట్‌లో  ఆమె  సూట్‌కేస్  దొంగిలించబడింది. అందులో  తన నగలు ఉన్నాయని ఆమె వాపోయింది. ఊర్వశి రౌతేలా ఇటీవలే వింబుల్డన్ టోర్నీలో పాల్గొని భారత్‌కు తిరిగి వస్తుండగా లండన్‌లోని గాట్‌విక్ విమానాశ్రయంలో ఈ సంఘటన జరిగింది. ఆమె తన లగ్జరీ సూట్‌కేస్‌లో ఉన్న రూ. 70 లక్షల విలువైన ఆభరణాలు చోరీకి గురయ్యాయని పోలీసులకు ఫిర్యాదు చేసింది. విమానాశ్రయ అధికారులు ఈ విషయంలో తనకు ఎలాంటి సహాయం చేయలేదని ఊర్వశి తీవ్ర నిరాశ వ్యక్తం చేసింది. ఆమె ఈ షాకింగ్ సంఘటన గురించి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్  చేస్తూ ఎమిరేట్స్, వింబుల్డన్ అధికారులను ట్యాగ్ చేసింది.  కాగా ఈ నెల ప్రారంభంలో లండన్‌లో జరిగిన వింబుల్డన్ ఛాంపియన్‌షిప్ 2025లో మహిళల సింగిల్స్ ఫైనల్ మ్యాచ్‌కు ఊర్వశి  హాజరైంది.  

ఇది మొదటిసారి కాదు

ఊర్వశి రౌతేలాకు ఇలాంటి చేదు అనుభవాలు ఇది మొదటిసారి కాదు. గతంలో కూడా ఆమె తన ఆస్తులను కోల్పోయినట్లు వార్తలు వచ్చాయి. 2023లో కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ సందర్భంగా కూడా ఆమె తన ఒక చెవిపోగు పోగొట్టుకున్నారని, దాని విలువ దాదాపు రూ. 45 లక్షలు ఉంటుందని ఆమె బృందం వెల్లడించింది. అలాగే, గతంలో తన ఐఫోన్ కూడా చోరీకి గురైందని ఆమె పేర్కొన్నారు. ఈ వరుస సంఘటనలు ఊర్వశి రౌతేలా అభిమానులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. లండన్ ఎయిర్‌పోర్ట్ అధికారులు ఈ ఆరోపణలపై ఎలా స్పందిస్తారో, దర్యాప్తులో ఏమైనా పురోగతి ఉంటుందో వేచి చూడాలి.

ఇక సినిమాల విషయానికి వస్తే ఊర్వశి రౌతేలా ప్రస్తుతం పలు బాలీవుడ్, తెలుగు సినిమాలతో బిజీగా ఉంది. ఆమె చేతిలో కొన్ని ఆసక్తికరమైన ప్రాజెక్ట్‌లు ఉన్నాయి. ప్రధానంగా స్పెషల్ సాంగ్స్‌తో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఆమె, ప్రస్తుతం హీరోయిన్‌గా, కీలక పాత్రల్లో నటించే స్థాయికి ఎదిగింది. మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య సినిమాలో  బాస్ పార్టీ పాటతో తెలుగు ప్రేక్షకులను ఊర్వశి ఉర్రూతలూగించింది. ఈ పాట యూట్యూబ్‌లో రికార్డు వ్యూస్‌ను సాధించి, ఆమెకు భారీ పాపులారిటీని తెచ్చిపెట్టింది.

ఇక నందమూరి బాలకృష్ణ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో వచ్చిన ఈ తెలుగు చిత్రంలో ఊర్వశి SI జానకి అనే కీలక పాత్రలో నటించింది. ఈ సినిమాలో దబిడి దిబిడి అనే మాస్ పాటలో బాలయ్యతో కలిసి స్టెప్పులు వేసింది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద విజయం సాధించి, ఆమెకు నటిగా మంచి బ్రేక్ ఇచ్చింది. ఇప్పుడు ఊర్వశి రౌతేలాకు ప్రస్తుతం తెలుగులో మంచి డిమాండ్ ఉంది. కేవలం ఐటెం సాంగ్స్ కాకుండా, నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రల్లో కూడా ఆమెకు అవకాశాలు వస్తున్నాయి. రామ్ పోతినేని నటిస్తోన్న  ఆంధ్రా కింగ్ తాలూకా వంటి సినిమాల్లో ఆమె నటిస్తుంది.  జూనియర్ ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ కాంబినేషన్ మూవీ డ్రాగన్ లో కూడా ఒక కీలక పాత్రలో లేదా ఐటెం సాంగ్‌లో అవకాశం అందుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. 

Advertisment
తాజా కథనాలు