/rtv/media/media_files/2025/04/18/KUg2GL96f2qdU18tDSdF.jpg)
Urvashi Rautela claims having temple on her name
Urvashi Rautela బాలీవుడ్ బ్యూటీ ఊర్వశీ రౌతేలా తరచూ ఏదో ఒక విషయంపై వార్తల్లో నిలుస్తుంది. తాజాగా ఊర్వశీ ఉత్తరాఖండ్ లో తన పేరుపై ఆలయం ఉందంటూ ఓ ఇంటర్వ్యూలో చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి. ఈ వ్యాఖ్యలపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. కొందరు నవ్వుతూ సరదాగా కామెంట్లు పెడుతుండగా.. మరికొందరు.. నాన్సెన్స్! ఆమె అనారోగ్యానికి రోగ నిర్దారణ అవసరం అంటూ ఊర్వశీ పై సెటైర్లు వేస్తున్నారు.
Also Read: Health Tips: మీకు మాట్లాడుతూ భోజనం చేసే అలవాటు ఉందా?.. ఈ 5 షాకింగ్ విషయాలు తప్పక తెలుసుకోండి!
👀🗣️Urvashi Rautela has once again sparked buzz online with her latest claim. According to the Bollywood actor, she has a temple dedicated to her in Uttarakhand.
— Hindustan Times (@htTweets) April 17, 2025
Read her full statement 🔗https://t.co/DjhnAjq6qC pic.twitter.com/eTMRNK5eNx
దక్షిణ భారతదేశంలో కూడా గుడి
అయితే ఊర్వశీ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఉత్తరాఖండ్ లో తన పేరు మీద ఒక ఆలయం ఉందని.. ఎవరైనా బద్రీనాథ్ వెళితే.. దాని పక్కనే ఉన్న తన ఆలయాన్ని సందర్శించండి అని తెలిపింది. అక్కడ తన కోసం పూజలు కూడా నిర్వహిస్తారని చెప్పింది. అలాగే ఢిల్లీలోని ఓ విశ్వవిద్యాలయంలో విద్యార్థులు తన ఫొటోకు దండలు వేసి.. 'దేవతగా' పిలుస్తారని చెప్పింది. ఇది విని తాను కూడా ఆశ్చర్యపోయానని.. కానీ, దీని గురించి కథనాలు కూడా ఉన్నాయని పేర్కొంది. అంతేకాదు తెలుగులో కూడా ఆమెకు చాలా మంది అభిమానులు ఉన్నారని.. దక్షిణ భారతదేశంలో కూడా ఒక ఆలయాన్ని నిర్మించాలని ఆశిస్తున్నట్లు తెలిపింది. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
latest-news | cinema-news
Also Read: Jagamerigina Satyam: తెలంగాణ మట్టి వాసనను గుర్తుచేసేలా మరో సినిమా.. రవితేజ మేనల్లుడు హీరోగా!