NTR 31 Updates: జాక్ పాట్ కొట్టేసిన బాలయ్య బ్యూటీ.. ఎన్టీఆర్‌తో దబిడి దిబిడే..

బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌతేలా ఎన్టీఆర్ తో కలిసి నటించే లక్కీ ఛాన్స్ కొట్టేసింది. ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ కాంబోలో రాబోతున్న మూవీ కోసం ఊర్వశి రౌతేలాను పరిశీలిస్తున్నారట మూవీ టీం. అదే నిజమైతే, ఊర్వశికు ఈ మూవీతో తెలుగులో మంచి బ్రేక్ రావడం పక్కా.

New Update
NTR 31 Updates

NTR 31 Updates

NTR 31 Updates: బాలీవుడ్ హాట్ బ్యూటీ ఊర్వశి రౌతేలా ఇటీవలే 'డాకు మహారాజ్'('Daku Maharaj') చిత్రంలో దబిడి దిబిడి అంటూ బాలయ్య(Balakrishna)తో మాస్ స్టెప్స్ వేస్తూ కుర్రకారును ఉక్కిరి బిక్కిరి చేసింది.  'డాకు మహారాజ్' తో తెలుగులో మరింత పాపులారిటీ సాధించింది. హీరోయిన్ అంటే ఓన్లీ గ్లామర్ షోనే కాదు పెర్ఫార్మన్స్ కి కూడా స్కోప్ ఉన్న పాత్రలు చేయాలంటూ నిర్ణయం తీసుకుందంట ఈ ముద్దుగుమ్మ. ఇకపై ప్రాధాన్యత ఉన్న పాత్రలు మాత్రమే చేయాలని డిసైడ్ అయిందట.

Also Read:Samantha: "సంథింగ్ స్పెషల్" అంటూ సమంత పోస్ట్ ...పెళ్లి గురించేనా..? - Rtvlive.com

హైదరాబాద్‌లో భారీ యాక్షన్‌ సీన్స్..

అయితే తాజాగా ఈ అమ్మడుకు సంబంధించిన వార్త ఒకటి సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతోంది. ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కాంబోలో రూపొందుతున్న ఎన్టీఆర్ 31మూవీలో ఛాన్స్ కొట్టేసిందట ఈ ముద్దుగుమ్మ. ఈ సినిమా హైదరాబాద్‌లో షూటింగ్‌ ప్రశాంత్ నీల్ ప్రస్తుతం భారీ యాక్షన్‌ సన్నివేశాలను తెరకెక్కిస్తున్నాడు. కథ ప్రకారం ఈ మూవీలో ఊర్వశి రౌతేలా పవర్‌ఫుల్‌ ఫీమేల్‌ రోల్‌లో కనిపించబోతున్నట్లు సమాచారం.

Also Read:SLBC ప్రమాద ఘటన.. రెండు రోజుల్లో ఆపరేషన్‌ పూర్తి చేస్తాం: మంత్రి ఉత్తమ్‌

ఈ వార్త నిజమైతే, ఊర్వశి రౌతేలాకు ఈ మూవీ తెలుగులో మంచి బ్రేక్  రావడం మాత్రం పక్కా. అయితే త్వరలో ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్‌లో ఊర్వశి  జాయిన్‌ అవ్వనుందట. ఎన్టీఆర్ 31 గా పిలవబడే ఈ ప్రాజెక్టుకు ‘డ్రాగన్‌’ అనే వర్కింగ్‌ టైటిల్‌ పరిశీలనలో ఉంది.

Also Read: హైదరాబాద్ నుంచి ఏపీకి స్పెషల్ ట్రైన్స్.. లిస్ట్ ఇదే

Also Read: Chhaava: ఛత్రపతి మహారాజ్ ఫ్యాన్స్ కి అదిరిపోయే న్యూస్.. 'ఛావా' ఇప్పుడు తెలుగు వెర్షన్ లో కూడా

Advertisment
తాజా కథనాలు