ఆ డబ్బులన్నీ మీ కోసమే ఖర్చు చేస్తా.. RTC కార్మికులకు సీఎం రేవంత్ బంపరాఫర్!
సంస్థ లాభాల బాట పడుతున్న ఈ సమయంలో RTC కార్మికులు సమ్మె ఆలోచనను విరమించాలని సీఎం రేవంత్ రెడ్డి కోరారు. ఆదాయమంతా మీ చేతిలో పెడతాం.. ఎలా ఖర్చు చేద్దామో మీరే సూచన చేయాలని కార్మికులను కోరారు. ఆ డబ్బులు మీ కోసమే ఖర్చు చేస్తానని స్పష్టం చేశారు.