/rtv/media/media_files/2025/04/20/0BCFadu6pgZEZSYXoq9w.jpg)
Ponnam Prabhakar
రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక ప్రకటన చేశారు. తెలంగాణ ఆర్టీసీలో త్వరలోనే ఖాళీలు భర్తీ చేస్తామని తెలిపారు. మరికొన్నిరోజుల్లో 3038 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేస్తామని చెప్పారు. వీటిలో 2 వేల డ్రైవర్ పోస్టులు, 743 శ్రామిక్, 74 డిప్యూటీ సూపరింటెండెంట్ (ట్రాఫిక్), 114 డిప్యూటీ సూపరింటెండెంట్ (మెకానికల్), 25 డిపో మేనేజర్/అసిస్టెంట్ ట్రాఫిక్ మేనేజర్ పోస్టులు ఉన్నాయని తెలిపారు.
Also Read: సీఎంకు ఢిల్లీ ఎయిర్‌పోర్ట్ షాక్.. మర్యాదగా మాట్లాడలేనంటూ ఒమర్ అబ్దుల్లా ఫైర్!
అలాగే.. 8 అసిస్టెంట్ మెకానికల్ ఇంజినీర్ పోస్టులు, 23 అసిస్టెంట్ ఇంజినీర్ (సివిల్), 11 సెక్షన్ ఆఫీసర్ (సివిల్), 6 అకౌంట్ ఆఫీసర్స్, 7 మెడికల్ ఆఫీసర్స్ జనరల్, 7 మెడికల్ ఆఫీసర్స్ స్పెషలిస్ట్ ఉద్యోగాల పోస్టులు ఉన్నాయని తెలిపారు. త్వరలోనే వీటిని భర్తీ చేస్తామని వెల్లడించారు. మరోవైపు గ్రామస్థాయిలో రెవెన్యూ వ్యవస్థను పునరుద్ధరించాలని రేవంత్ సర్కార్ భావిస్తోంది. ఇందులో భాగంగానే 10,954 జీపీవో పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
Also Read: ఎవరికైనా చూపించండ్రా బాబు.. ఫుల్‌గా తాగి నడిరోడ్డుపై యువతి రచ్చ రంబోలా (వీడియో చూశారా)
జాబ్‌చార్ట్ కూడా ఇటీవలే ప్రకటించగా బీఆర్ఎస్ హయాంలో నియమించిన అర్హులైన VRA, VROలను GPOలుగా నియమించి, మిగిలిన పోస్టులను డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేయాలని చూస్తోంది. జీపీవోలుగా పనిచేసేందుకు ఆసక్తి గల అభ్యర్థుల జాబితాను కలెక్టర్ల ద్వారా సేకరించగా దాదాపు 7 వేల మందికి అర్హతలున్నట్లు వెల్లడించింది. ఎంట్రన్స్ టెస్ట్నిర్వహించి, వీరందరినీ జీపీఓలుగా అపాయింట్ చేయాలని యోచిస్తోంది.
Also Read: ట్రంప్‌ను తిడుతూ.. వలసదారులకు స్వాగతం అంటున్న అమెరికన్ పౌరులు
Also Read: సుప్రీం కోర్టుపై బీజేపీ ఎంపీ సంచలన కామెంట్స్.. ఊహించని షాక్ ఇచ్చిన జేపీనడ్డా!
rtc | tgsrtc | rtv-news | Minister Ponnam Prabhakar