ఆర్టీసీ కార్మికులు సమ్మె ఆలోచన వీడాలని సీఎం రేవంత్ రెడ్డి కోరారు. ఈ రోజు రవీంద్రభారతిలో నిర్వహించిన మేడే వేడుకల్లో పాల్గొన్న సీఎం మాట్లాడుతూ.. ఇప్పుడిప్పుడే ఆర్టీసీ లాభాల బాటలో పయనిస్తోందన్నారు. ఇది మీ సంస్థ అని.. దీన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత కార్మికులపైనే ఉందని అన్నారు. గత పదేళ్లలో విధ్వంసం జరిగిందన్నారు. తీవ్రమైన ఆర్థిక దోపిడీ జరిగిందని ఆరోపించారు. ఆర్టీసీ కార్మికులు పంతాలు, పట్టింపులకు పోవద్దని కోరారు. ఏదైనా సమస్య ఉంటే మంత్రితో చర్చించాలని సూచించారు. వచ్చే ఆదాయమంతా మీ చేతిలో పెడతాం.. ఎలా ఖర్చు చేద్దామో మీరే సూచన చేయాలని కార్మికులకు విజ్ఞప్తి చేశారు.
పదేళ్లలో రికార్డు స్థాయిలో తెలంగాణ అప్పు
— Telugu Galaxy (@Telugu_Galaxy) May 1, 2025
60 సంవత్సరాలు. 16 మంది ముఖ్యమంత్రులు. 72 వేల కోట్ల రూపాయలు అప్పు చేస్తే
ఒక వ్యక్తి, ఒక పార్టీ, ఒక కుటుంబం 10 సంవత్సరాల్లో 7 లక్షల కోట్ల అప్పు చేసింది
ఆర్టీసీ కార్మికులకు న్యాయం చేయలేదు
హైదరాబాద్ రవీంద్రభారతిలో మేడే వేడుకల్లో… pic.twitter.com/NaU9wykVG0
ప్రతీ పైసా మీ కోసమే ఖర్చు..
అణా పైసా కూడా నేను ఇంటికి తీసుకెళ్లేది లేదు.. మీ కోసమే ఖర్చు చేస్తానని స్పష్టం చేశారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదు… అందుకే ఒకసారి ఆలోచించండని సూచించారు. కష్టమైనా, నిష్ఠూరమైన ఉన్నది ఉన్నట్టు చెప్పాల్సిన బాధ్యత తనపై ఉంటుందన్నారు. సమ్మె పోటు రాష్ట్రానికి నష్టం చేస్తుందన్నారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ ఇప్పుడిప్పుడే పట్టాలెక్కుతోందని.. మరో ఏడాదిలో కొంత కుదురుకుంటుందన్నారు. పదేళ్లు ఏం చేయని వాళ్లు వచ్చి చెబితే వాళ్ల వలలో పడొద్దన్నారు. వారి విషపు చూపుల్లో చిక్కుకోవద్దన్నారు. ఆర్టీసీ కార్మికులు నన్ను నమ్మండి.. నమ్ముకున్న మీకు అండగా ఉంటానంటూ భరోసానిచ్చారు.
(tgsrtc | cm-revanth-reddy)