/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/TSRTC-jpg.webp)
Telangana RTC workers strike Tomorrow
TGSRTC: తెలంగాణ ఆర్టీసీ మరోసారి సమ్మెకు సిద్ధమైంది. కార్మికులు, ఉద్యోగులు కొంతకాలంగా తమ డిమాండ్లను పరిష్కారించాలని కోరుతున్నారు. ఇప్పటికే మూడుసార్లు సమ్మె నోటీసులు ఇచ్చారు. అయినప్పటికీ యాజమాన్యం, ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో RTC JAC సమ్మేకు దిగాలని నిర్ణయం తీసుకుంది.
విలీనం, పాత బకాయిల ఊసేలేదు..
ఉద్యోగ భద్రత, ఉద్యోగులకు పూర్తి స్థాయిలో జీతాలు, ప్రభుత్వంలో విలీన ప్రక్రియ, RTC బస్సులను రాష్ట్ర ప్రభుత్వం స్వయంగా కొనుగోలు చేయడం వంటి డిమాండ్లను ప్రభుత్వం ముందుంచారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది గడిచినా హామీలను అమలు చేయట్లేదు. విలీన ప్రక్రియ గురించి ఎలాంటి ప్రకటన లేదు. పాత బకాయిల గురించి ఊసేలేదు. దీంతో తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్న సిబ్బంది.. సమ్మెనే మార్గంగా ఎంచుకున్నారు. ఈ మేరకు మే 7 నుంచి రాష్ట్రవ్యాప్తంగా సమ్మె బాట పట్టేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ప్రభుత్వం చర్చలు జరిపి, తమహామీలను నెరవేర్చకపోతే మరికొన్ని గంటల్లో సేవలు ఆపేస్తామని చెబుతున్నారు.
Also Read: కీలక అప్‌డేట్.. ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పించిన మరో టెర్రరిస్ట్ అరెస్టు
మా మాట వినండి..
ఇందులో భాగంగానే ఆర్టీసీ అధికారులతో రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ భేటీ అయ్యారు. కార్మికుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి వచ్చాయని, సీఎంతో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. ఆర్టీసీ పరిరక్షణ, కార్మికుల సంక్షేమంతో పాటు ప్రయాణికుల సౌకర్యానికి ప్రాధాన్యత ఇస్తామన్నారు. ఆర్టీసీ ఇప్పుడే నష్టాల నుంచి కోలుకుంటోందని, ఇలాంటి సమయంలో సమ్మే చేయొద్దని కోరారు. ఆర్టీసీ సమ్మే వల్ల ప్రజలు ఇబ్బందిపడతారు. గత ప్రభుత్వం ఆర్టీసీని నిర్వీర్యం చేసింది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉద్యోగులకు బాండ్ మొత్తం రూ.400 కోట్లు, పీఎఫ్ రూ.1039 కోట్లు, సీసీఎస్ బకాయిలు రూ.345 కోట్లు చెల్లించాం. 1500 మందికి కారుణ్య నియామకాలు పూర్తి చేశాం. ఆర్టీసీలో 3,038 ఉద్యోగాలను భర్తీ చేస్తాం. ఇవన్నీ దృష్టిలోపెట్టుకుని కొంతకాలం ఓపిక పట్టాలని, సమ్మే ఆలోచన విరమించుకోవాలని సూచించారు.
Also Read: వీడు భర్త కాదు బండరాయి.. భార్య ముక్కు అందంగా ఉందని కొరుక్కు తినేశాడు వెధవ!
tgsrtc | protest | cm revanth | telugu-news | Minister Ponnam Prabhakar