CM Chandrababu: తెలంగాణ ఎంపీ, ఎమ్మెల్యేలకు చంద్రబాబు శుభవార్త!
తెలంగాణ ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు ఏపీ సీఎం చంద్రబాబు శుభవార్త చెప్పారు. తిరుమలలో తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలను అనుమతించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇవాళ సీఎంతో భేటీ అనంతరం టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు ఈ విషయాన్ని తెలిపారు.