తిరుమలలో నకిలీ టికెట్లు కలకలం.. ఇంటి దొంగల పనే

తిరుపతి దేవస్థానంలో నకిలీ టికెట్లు కలకలం రేపాయి. కొందరు రూ.300 స్పెషల్ దర్శనం నకిలీ టికెట్లు భక్తులకు విక్రయించి దర్శనం చేయిస్తున్నారు. కౌంటర్ సిబ్బంది లక్ష్మీపతితో అగ్నిమాపక PSG మణికంఠ, భానుప్రకాష్‌లు కలిసి భక్తులకు మోసం చేసినట్లు అధికారులు గుర్తించారు.

New Update
tirumala employee

tirumala employee Photograph: (tirumala employee)

తిరుమల తిరుపతి దేవస్థానంలో నకిలీ టికెట్లు కలకలం రేపాయి. కొందరు దళారీలు రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన నకిలీ టికెట్లు భక్తులకు ఇచ్చి స్వామివారి దర్శనం చేయిస్తున్నారు. టికెట్లపై అనుమానం రావడంతో వైకుంఠ క్యూ కాంప్లెక్స్ దగ్గర విజిలెన్స్ వింగ్ అధికారులు టికెట్లు కొనుగోలు చేసిన భక్తులను నిలిపివేశారు. రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన కౌంటర్ సిబ్బంది లక్ష్మీపతితో అగ్నిమాపక PSG మణికంఠ, భానుప్రకాష్ లు కలిసి భక్తులకు మోసం చేసినట్లు ఆలయ అధికారులు గుర్తించారు. ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలంలో కూడా మంగళవారం టోల్‌ గేట్ సిబ్బంది చేతివాటం ప్రదర్శించిన విషయం తెలిసిందే. శ్రీశైలం ఆలయానికి వెళ్లే దారిలో ఎంట్రన్స్‌ లో ఎన్నో సంవత్సరాలుగా ఒక టోల్‌ గేట్‌ నిర్వహిస్తున్నారు. టోల్‌గేట్‌లో పని చేసే సిబ్బంది.. గత కొంత కాలంగా చేతివాటం ప్రదర్శిస్తున్నారనే ఆరోపణలు భారీగా వినపడుతున్నాయి. 

Read also ;శ్రీశైలం ఆలయంలో కొట్లాట.. ఈవో Vs అర్చకులు!

అగ్నిమాపక సిబ్బంది మణికంఠ సహాయంతో కొందరు నకిలీ టికెట్లను తయారు చేస్తున్నారు. హైదరాబాద్, పొద్దుటూరు, బెంగళూర్‌ల నుంచి వచ్చిన భక్తులకు విక్రయించి సుమారు 11 మంది నుంచి రూ.19 వేలు వసూలు చేశారు ఇంటి దొంగలు. వైకుంఠ దర్శనాలకు భక్తులను సేకరించే  టాక్సీ డ్రైవర్లు శశి, చెన్నై జగదీష్, అగ్నిమాపక PSG మణికంఠ, కౌంటర్ సిబ్బంది లక్ష్మీపతి, భానుప్రకాష్ PSGలను విజిలెన్స్ వింగ్, 1 టౌన్ పోలీస్ అధికారులు విచారిస్తున్నారు. 

Also Read: Mahakumbh:కుంభమేళాలో పాల్గొనే 14 అఖాడాలు ఇవే..అసలు వాటి చరిత్ర ఏంటంటే

Advertisment
తాజా కథనాలు