AP Politics: ఇదేం పద్ధతి.. చంద్రబాబు సీరియస్.. అమిత్ షా కీలక ఆదేశాలు!

తిరుపతి తొక్కిసలాట ఘటన నేపథ్యంలో క్షేత్రస్థాయి పరిశీలనకు కేంద్ర హోంశాఖ అధికారులు సిద్ధమైన విషయం తెలిసిందే. ఈ అంశంపై చంద్రబాబు అమిత్ షా ఎదుట సీరియస్ అయినట్లు తెలుస్తోంది. దీంతో అమిత్ షా ఆదేశాలతో కేంద్ర అధికారులు TTDకి రాసిన లేఖను వెనక్కు తీసుకున్నారు.

New Update

టీటీడీపై కేంద్ర హోంశాఖ సమీక్ష అంశంలో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. టీటీడీ అధికారులతో హోంశాఖ అదనపు కార్యదర్శి సంజీవ్ కుమార్ జిందాల్ సమావేశం రద్దు అయ్యింది. టీటీడీ అధికారులతో సమీక్షా ఆదేశాలను హోంశాఖ వెనక్కు తీసుకుంది. తిరుమలలో వరుస ఘటనలపై కేంద్రం సీరియస్ అయినట్లు నిన్న వార్తలు వచ్చాయి. తొక్కిసలాట, లడ్డు కౌంటర్లో అగ్నిప్రమాదం ఘటనలపై కేంద్ర హోం శాఖ వివరాలు కోరడం సంచలనంగా మారింది. క్షేత్రస్థాయి పరిశీలనకు కేంద్ర హోంశాఖ అదనపు కార్యదర్శి సంజీవ్ కుమార్ జిందాల్‌ వస్తున్నట్లు ప్రకటించడంతో పాలిటిక్స్ ఇంకా హీటెక్కాయి.
ఇది కూడా చదవండి: పవన్ వ్యాఖ్యలకు మాకు సంబంధం లేదు.. నారా లోకేష్ షాకింగ్ ప్రకటన!

ముందుగా కేంద్రం హోంశాఖ విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం నేడు, రేపు టీటీడీ అధికారులతో సంజీవ్ కుమార్ సమావేశం నిర్వహించాల్సి ఉంది. దీంతో టీటీడీ చరిత్రలో మొదటిసారి కేంద్రం జోక్యం చోసుకుందంటూ సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అయ్యాయి. ఈ అంశాన్ని అధికార కూటమి సర్కార్ సీరియస్ గా తీసుకుంది. 
ఇది కూడా చదవండి: BIG BREAKING: డిప్యూటీ సీఎం పవన్‌కు ప్రాణహాని.. జనసేన ఆఫీస్​పై ఎగిరిన డ్రోన్లు!

నిన్న ఏపీకి వచ్చిన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా దృష్టికి సీఎం చంద్రబాబు ఈ విషయాన్ని తీసుకెళ్లారు. దీంతో ఆ లేఖను వెంటనే వెనక్కి తీసుకోవాలంటూ హోంశాఖ ఉన్నతాధికారులకు అమిత్‌షా ఆదేశించారు. తప్పనిసరి పరిస్థితుల్లో టీటీడీ అధికారులతో సమావేశాన్ని రద్దు చేస్తున్నట్టు హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పడినట్లు తెలుస్తోంది. 

వైసీపీకి అస్త్రం..

కేంద్ర హోంశాఖ రాసిన లేఖను ప్రతిపక్ష వైసీపీ అస్త్రంగా మార్చుకుంది. తిరుపతి చరిత్రలో కేంద్ర హోంశాఖ ఎప్పుడూ జోక్యం చేసుకోలేదని.. కుటమి ప్రభుత్వ అసమర్ధత కారణంగా ఇప్పుడు ఆ పరిస్థితి నెలకొందని ధ్వజమెత్తింది. ఆ పార్టీ సోషల్ మీడియాలో ఇందుకు సంబంధించిన వార్తలు జోరుగా చక్కర్లు కొట్టాయి.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు