/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/ttd-1-3-jpg.webp)
Tirumala: కలియుగ దైవం తిరుమల శ్రీవారిని దర్శించుకోవడానికి నిత్యం వేలాది మంది భక్తులు తిరుమల కొండకు చేరుకుంటుంటారు. కేవలం రెండు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా..ఇతర రాష్ట్రాలు, విదేశాల నుంచి కూడా భక్తులు భారీగా వస్తుంటారు.ఈ క్రమంలో స్వామి వారిని దర్శించుకోవడానికి కేవలం హిందువులు మాత్రమే కాకుండా..ఇతర మతస్తులు కూడా చాలా మందినే వస్తుంటారు.
తిరుమల కొండపై కొన్ని నియమాలు, కట్టుబాట్లు ఉంటాయి. మాంసం, మద్యం, మత్తు పదార్థాలను తిరుమల కొండపైకి అధికారులు తీసుకుని రానివ్వరనే విషయం తెలిసిందే. అయితే ఇలా తిరుమల కొండపై గతంలో మాంసం, మద్యం, ఇతర నిషేధిత వస్తువులు కనిపించడం.. ఆ సమయంలో తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న విషయం తెలిసిందే. కానీ తాజాగా మరోసారి అలాంటి ఘటనే చోటు చేసుకుంది.
Also Read: Fire Accident: : తిరుపతి-తిరువూరు బస్సు అగ్నికి ఆహుతి..20 మంది ప్రయాణికులు!
ఇతర రాష్ట్రాలకు చెందిన 28 మంది అన్యమతస్తుల బృందం శుక్రవారం తిరుపతికి వచ్చింది. అలిపిరి ఘాట్ మార్గం నుంచి తిరుమల కొండపైకి వారంతా చేరుకున్నారు. అయితే వారు తమ వెంట పలావ్, కోడిగుడ్ల కూర తీసుకుని ఏకంగా కొండపైకి రావడం ఇప్పుడు తీవ్ర విమర్శలకు దారి తీసింది. ఓ భారీ గిన్నెలో కోడిగుడ్ల కూర, పలావ్‌తో వారు కనిపించారు.
28 మంది భక్తుల బృందాన్ని...
కొండపైకి చేరుకున్న తర్వాత రాంభగీచ బస్టాండ్‌కు సమీపంలోని పార్కింగ్ ప్రాంతంలో వారంతా తాము తెచ్చుకున్న పలావ్, కోడిగుడ్ల కూర తిన్నారు. అయితే వారు కోడిగుడ్ల కూర తినడం అక్కడే ఉన్న మిగతా భక్తులు గమనించారు. కొండ పైకి కోడిగుడ్ల కూర రావడం ఏంటని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడంతో పాటు దగ్గర్లో ఉన్న పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు.. ఆ 28 మంది భక్తుల బృందాన్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
అసలు కొండపైకి కోడిగుడ్ల కూర తీసుకురావడం ఏంటని ప్రశ్నించారు. అయితే తమకు తిరుమల నిబంధనల గురించి తెలియదని.. తాము వండుకున్న కోడిగుడ్ల కూరను తమతోపాటు కొండపైకి తీసుకువచ్చినట్లు పోలీసులకు చెప్పారు. ఇక వారంతా తమిళనాడులోని తిరువళ్లూరు సమీపంలోని గుమ్మడిపూడి గ్రామానికి చెందిన వారిగా తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు గుర్తించారు.
ఈ విషయం బయటకు రావడంతో శ్రీవారి భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో టీటీడీలో భద్రతా తనిఖీల వైఫల్యం మరోసారి బయటపడింది. దీనిపై టీటీడీపై భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏకంగా 28 మంది వ్యక్తులు తిరుమల కొండకు రావడం, వారు కోడిగుడ్ల కొండ మీదకు తీసుకురావడాన్ని అధికారులు గుర్తించలేదా అంటూ ప్రశ్నిస్తున్నారు.
అంతే కాకుండా వారంతా ఇతర మతస్తులు కావడం మరిన్ని అనుమానాలకు తావిస్తోంది. వారు కావాలనే ఇలా చేశారనే అనుమానాన్ని భక్తులు, నెటిజన్లు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా టీటీడీ అధికారులు కళ్లు తెరిచి.. తిరుమలలో తనిఖీలు సక్రమంగా నిర్వహించి, భద్రతా వైఫల్యాలను అధిగమించాలని అంటున్నారు.
Also Read: Karnataka: మెట్రో ప్రయాణికులకు బిగ్ షాక్..భారీగా ఛార్జీలు పెంపు!
Also Read: Ap Govt: ఏపీ సర్కార్ కీలక నిర్ణయం.. సీఐడీ మాజీ చీఫ్ సునీల్ విచారణకు ఆదేశాలు!