TTD: పాలకమండలికి, అధికారులకు మధ్య విభేదాలు.. TTD చైర్మన్ కీలక ప్రకటన!

పాలకమండలికి, అధికారులకు మధ్య విభేదాలు లేవని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు స్పష్టం చేశారు. కొన్ని మాధ్యమాలల్లో టీటీడీ పై అసత్య ప్రచారాలు జరుగుతున్నాయని ఫైర్ అయ్యారు. అసత్య వార్తలు, ప్రచారాలు చేస్తే చర్యలు ఉంటాయని హెచ్చరించారు.

New Update
BR NAIDU Press Meet

BR NAIDU Press Meet

TTD: కొన్ని ప్రసార మాధ్యమాలలో, సామాజిక మాధ్యమాలలో టీటీడీ పై అసత్య ప్రచారాలు జరుగుతున్నాయని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు(B. R. Naidu) ఫైర్ అయ్యారు. వార్త ప్రచురణ, ప్రసారం చేసేటప్పుడు ఒకటిరెండు సార్లు పరిశీలించాలని కోరారు. మీడియా చేతిలో ఉందని ఇష్టానుసారం అసత్య వార్తలు, ప్రచారాలు చేస్తే చర్యలు ఉంటాయని హెచ్చరించారు. పాలకమండలికి, అధికారులకు మధ్య విభేదాలు ఉన్నట్టు వస్తున్న వార్తలను తీవ్రంగా ఖండిస్తున్నానన్నారు. తిరుమల అనేది కోట్లాది మంది హిందువులు మనోభావాలకు సంబంధించిన విషయమన్నారు.
ఇది కూడా చదవండి: Mahakumbh Mela: దేవుళ్లు, రాక్షసుల మధ్య యుద్ధం జరిగితే.. కుంభమేళ ఎందుకొచ్చిందంటే..?

సమన్వయంతో పని చేస్తున్నాం..

అందరం సమన్వయంతో పని చేస్తూ భక్తులకు మెరుగైన సౌకర్యం కల్పిస్తున్నామన్నారు. జనవరి 8వ తారీఖున అత్యంత దురదృష్టవంతమైన సంఘటన జరిగిందన్నారు. తొక్కిసలాట సంఘటన మినహా మిగతా అన్ని ఏర్పాట్లు బ్రహ్మాండంగా ఉన్నాయన్నారు. భక్తులు ప్రశాంతంగా వైకుంఠద్వార దర్శనం చేసుకుంటున్నారన్నారు. ఇలాంటి ఘటనలు భవిష్యత్తులో జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నామన్నారు.
ఇది కూడా చదవండి: అల్లు అర్జున్, రేవంత్ రెడ్డి వివాదాన్ని మళ్లీ గెలికిన డైరెక్టర్.. వీడియో వైరల్!

ఘటనలో మృతి చెందిన కుటుంబాలకు, గాయపడిన వారికి సీఎం ఆదేశాల ప్రకారం పరిహారం అందించామన్నారు. బోర్డు సభ్యులతో ఏర్పాటు చేసిన రెండు బృందాలు బాధితులకు పరిహారం అందించాయన్నారు. శ్రీవారి భక్తులందరికీ మకర సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు బీఆర్ నాయుడు. 

Also Read :  నేటినుంచే మహా కుంభ మేళా..దేశ వ్యాప్తంగా 13 వేల రైళ్లు!

Also Read :  బాలయ్య ఫ్యాన్స్కు బిగ్ షాక్.. ఆన్లైన్ లో డాకు మహారాజ్ HD ప్రింట్

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు