తిరుమలలో ఇంటి దొంగ..రెండేళ్లలో ఆ కాంట్రాక్ట్ ఉద్యోగి ఎంత కొట్టేశాడంటే?

శ్రీవారి ఆలయ పరకామణిలో జరిగిన బంగారు బిస్కెట్‌ దొంగతనంలో కేసు కొత్త మలుపు తిరిగింది.నిందితుడు వీరిశెట్టి పెంచులయ్య గత రెండు సంవత్సరాలలో మరో 555 గ్రాముల బంగారు బిస్కెట్స్, 100 గ్రాముల ఆభరణాలు, 157 గ్రాముల వెండిని దొంగలించినట్లు సమాచారం.

New Update
gold biscuit

gold biscuit

Tirumala: తిరుమల శ్రీవారి ఆలయ పరకామణిలో మూడు రోజుల క్రితం జరిగిన బంగారు బిస్కెట్‌ దొంగతనంలో కేసు మరో కొత్త మలుపు తిరిగింది. మూడు రోజుల క్రితం తిరుపతికి చెందిన వీరిశెట్టి పెంచులయ్య పరకామణి భవనంలో బంగారు చోరీ ఘటనలో పట్టుబడిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అతడ్ని విచారించగా మరిన్ని కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఇప్పటి వరకూ అతడు బంగారు నిల్వ ఉంచే గది నుంచి సుమారు 46 లక్షల విలువ గల బంగారు బిస్కెట్స్​ను దొంగతనం చేసినట్లు తెలిసింది.

Aslo Read: Mahakumbh 2025: తొలిరోజే కోటిన్నర మంది పుణ్య స్నానాలు!

ఈ కేసులో పెంచలయ్యను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించగా విస్తుపోయే నిజాలు వెలుగు చూశాయి. 100 గ్రాముల బంగారు బిస్కెట్ తో పాటు గతంలో మరో 555 గ్రాముల బంగారు బిస్కెట్స్, 100 గ్రాముల ఆభరణాలు, 157 గ్రాముల వెండిని దొంగలించినట్లు పోలీసులు తెలుసుకున్నారు. కాగా ఈ చోరిలో నిందితుడు పెంచలయ్య 100 గ్రాముల బంగారు బిస్కెట్​ను ట్రాలీకి ఉన్న పైపులలో దాచి పెట్టాడు. తనిఖీల్లో భాగంగా టీటీడీ భద్రతా అధికారులు బంగారు బిస్కెట్​ను గుర్తించారు. 

Aslo Read: Sabarimala: నేడే అయ్యప్ప మకరజ్యోతి దర్శనం..శబరిమలకు పోటెత్తిన స్వాములు

బంగారు బిస్కెట్​ను చూసిన భద్రత సిబ్బంది అది ట్రాలీలోకి ఎలా వచ్చిందనే అనుమానంతో పై అధికారులకు సమాచారం అందించారు.ఈ ఘటనపై విచారణ చేపట్టిన టీటీడీ విజిలెన్స్ అధికారులు బంగారు బిస్కెట్​ను దొంగలించింది యూనియన్ బ్యాంక్ కాంట్రాక్టు ఉద్యోగి పెంచలయ్యగా సీసీ కెమెరా ద్వారా రెండు గంటల్లోపే గుర్తించారు. తిరుపతికి చెందిన వీరిశెట్టి పెంచలయ్య తిరుమల శ్రీవారి పరకామణిలో కాంట్రాక్ట్ ఉద్యోగిగా గత రెండేళ్లుగా పని చేస్తున్నాడు. ఈజీగా డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో పరకామణిలోని బంగారం నిల్వ ఉంచే గదిలోని గోల్డ్ వస్తువులను దొంగిలించడం మొదలు పెట్టాడు.

పెంచలయ్య తీరుపై అనుమానం కలగడంతో టీటీడీ విజిలెన్స్‌ సిబ్బంది నిఘా ఉంచారు. మూడు రోజుల క్రితం అంటే శనివారం మధ్యాహ్నం గోల్డ్‌ స్టోరేజ్‌ గదిలో ఉన్న 100 గ్రాముల బంగారు బిస్కెట్‌ను దొంగిలించి ట్రాలీకి ఉన్న పైపులలో దాచిపెట్టాడు. తనిఖీల సమయంలో భద్రతా సిబ్బంది దీనిని గుర్తించగా వెంటనే అక్కడి నుంచి పారిపోయాడు.

విజిలెన్స్‌ సిబ్బంది ఫిర్యాదు మేరకు తిరుమల వన్‌టౌన్‌ పోలీసులు పెంచలయ్యపై కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలు పెట్టారు. పెంచలయ్యను అదుపులోకి తీసుకుని విచారించారు. ఈ సమయంలో గతంలో పరకామణిలో చేసిన చోరీల విషయం గురించి  వెలుగులోకి వచ్చాయి. పెంచలయ్య కాజేసిన స్వామివారి బంగారు వెండిని మొత్తాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

Also Read: Stock Market: పండగ పూట మంచి ఊపులో స్టాక్ మార్కెట్

Also Read: USA: మస్క్ చేతికి టిక్‌టాక్‌...అమ్మే ఆలోచనలో చైనా

Advertisment
తాజా కథనాలు