🔴Live News: హరీష్ రావుకు భారీ ఊరట...ఆ కేసు కొట్టివేసిన కోర్టు
Stay updated with the latest live news Updates in Telugu! Get breaking news, politics, entertainment, sports, and more from all categories. Stay informed, stay ahead!
Stay updated with the latest live news Updates in Telugu! Get breaking news, politics, entertainment, sports, and more from all categories. Stay informed, stay ahead!
హీరో విశ్వక్ సేన్ ఇంట్లో దొంగతనం చేసిన నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. షేక్ పేట నాలా వద్ద దొంగిలించిన డైమండ్ రింగ్స్, ఇతర వస్తువులను విక్రయిస్తుండగా పట్టుబడ్డారు. భీమవరపు స్వరాజ్, బొల్లి కార్తీక్, నేరేడుమల్లి సందీప్ లను నిందితులుగా గుర్తించారు.
గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ కు ఇవాళ ఉదయం మంగళ్‌హాట్ పోలీసులు నోటీసులు జారీ చేశారు. గత నెల రోజులుగా చంపేస్తామంటూ ఆయనకు ఆగంతకుల నుంచి వరుసగా బెదిరింపు కాల్స్ వస్తున్నాయి. భద్రతా కారణాల వల్ల తనకు గన్ లైసెన్స్ మంజూరు చేయాలని ఎమ్మెల్యే కోరారు.
క్రికెటర్లు విదేశీ టూర్లో కుటుంబాలను తీసుకెళ్లకూడదనే నిర్ణయంపై కోహ్లీ అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఈ క్రమంలో బీసీసీఐ ఈ నిర్ణయాన్ని సవరించాలని చూస్తోంది. విదేశీ పర్యటనలో కుటుంబ సభ్యులు కూడా రావాలంటే.. ఆటగాళ్లు బీసీసీఐ నుంచి అనుమతి తీసుకోవాలని తెలుస్తోంది.
ధనుస్సురాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. అన్ని రంగాల వారికి తమ తమ రంగాల్లో శుభ ఫలితాలు ఉంటాయి.అనుకోని ప్రమాదం సంభవించే సూచనలు ఉన్నాయి. ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది. మిగిలిన రాశుల వారికి ఎలా ఉందంటే..
వరంగల్ లో మైనర్ బాలికలను వ్యభిచార రొంపిలోకి దింపుతున్న ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. మైనర్ లతో వ్యభిచారం చేయిస్తే ఎక్కువ డబ్బులు వస్తాయని మైనర్ సెక్స్ రాకెట్ ఏర్పాటుకు ఓ యువతితో ప్లాన్ వేసిన ముఠా. కీలక నిందితురాలు ముస్కు లతను అరెస్ట్ చేసిన పోలీసులు.
బీజేపీ ఎంపీ డీకే అరుణ ఇంట్లో చొరబడిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిని ఢిల్లీకి చెందిన అక్రమ్గా గుర్తించారు. అతడిని వెస్ట్ జోన్ డీసీపీ విజయ్‌కుమార్, జూబ్లీహిల్స్ పోలీసులు విచారిస్తున్నారు. చొరబాటుకు గల కారణాలను తెలుసుకుంటున్నారు.