/rtv/media/media_files/2025/03/20/HNDCJD19LuBPvXXEszyI.jpg)
BJP MLA Raja Singh
BJP MLA Raja Singh: గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ కు ఇవాళ ఉదయం మంగళ్‌హాట్ పోలీసులు నోటీసులు జారీ చేశారు. గత నెల రోజులుగా చంపేస్తామంటూ ఆయనకు ఆగంతకుల నుంచి వరుసగా బెదిరింపు కాల్స్ వస్తున్నాయి. ఇవాళ కాకపోతే రేపు అయినా నీ తల నరికేస్తామని ఆగంతకులు రాజాసింగ్‌ను బెదిరించారు. గుర్తు తెలియని ఫోన్ నంబర్ల నుంచి బెదిరింపు కాల్స్ వస్తున్నట్లుగా ఆయన అనుచరులు కూడా తెలిపారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యేకు నోటీసులు జారీ చేస్తూ, అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
Also Read: బెట్టింగ్ యాప్స్ కేసు.. అడ్డంగా దొరికిపోయిన పరేషాన్ బాయ్స్ ఇమ్రాన్- వీడియో వైరల్!
BJP MLA Raja Singh Letter To Police
ఈ నేపథ్యంలో పోలీసులకు రాజా సింగ్ భద్రత కోసం బుల్లెట్ ప్రూఫ్ వెహికిల్ అందుబాటులో ఉంచారు. అదనంగా, 1+4 సెక్యూరిటీ సద్వినియోగం చేసుకోవాలని కోరిన పోలీసులు.అత్యవసర పరిస్థితుల్లో ఎలాంటి ప్రమాదం జరుగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. గోషామహల్ నియోజకవర్గంలోని రహదారులు ఇరుకుగా ఉండటంతో బుల్లెట్ ప్రూఫ్ వాహనం అక్కడ ప్రయాణించడం కష్టమవుతోందని ఎమ్మెల్యే రాజాసింగ్ తెలిపారు. అందువల్ల ఎలాంటి పరిస్థితులనైనా స్వయంగా ఎదుర్కొనేందుకు తాను సిద్ధంగా ఉండాలనే ఉద్దేశంతో గన్ లైసెన్స్ కోసం దరఖాస్తు చేస్తున్నానని చెప్పారు. భద్రతా కారణాల వల్ల తనకు గన్ లైసెన్స్ మంజూరు చేయాలని ఎమ్మెల్యే కోరారు.
Also Read: ఈసీ ప్రతిపాదనతో మా వాదనకు మద్దతు..రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు
రాజకీయ నాయకుడిగా ఉండటం వల్ల తనకు ఎప్పుడైనా ప్రమాదం ఎదురవవచ్చని రాజాసింగ్ అన్నారు. పోలీసుల భద్రత కేవలం కొన్ని ప్రాంతాల్లో మాత్రమే ఉండడం వల్ల ప్రతి సమయంలో భద్రత ఉండేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. గన్ లైసెన్స్ ఉంటే తన ప్రాణాలను రక్షించుకోవడానికి ఇది ఉపయోగపడుతుందని అభిప్రాయపడ్డారు.మరోవైపు రాజాసింగ్ గన్ లైసెన్స్ కోసం దరఖాస్తు పెట్టుకున్నారు. రాజాసింగ్ పెట్టుకున్న ఈ విజ్ఞప్తిపై పోలీసులు ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు.భద్రతా కారణాలను పరిశీలించిన తర్వాతే ఎటువంటి నిర్ణయం తీసుకోవాలో అధికారులుగా తాము చర్చిస్తున్నామని పోలీసులు తెలిపారు. ఎమ్మెల్యేకు భద్రతను మరింత పటిష్ఠంగా చేయాలని ఆలోచిస్తున్నామన్నారు. అవసరమైతే అదనపు భద్రత కల్పించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు.
Also Read: రా కి రా.. సార్ కి సార్..! గ్రోక్ ఏఐ దెబ్బ అదుర్స్ కదూ!
Also read: Manipur riots: మణిపూర్‌లో మళ్లీ ఘర్షణ.. ఈసారి హమర్, జోమి తెగల మధ్య గొడవలు
bjp-mla-raja-singh | goshamahal-mla-rajasing | latest-telugu-news | today-news-in-telugu | telangana-politics