BCCI: అసంతృప్తి వ్యక్తం చేసిన కోహ్లీ.. దిగొచ్చిన బీసీసీఐ

క్రికెటర్లు విదేశీ టూర్‌లో కుటుంబాలను తీసుకెళ్లకూడదనే నిర్ణయంపై కోహ్లీ అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఈ క్రమంలో బీసీసీఐ ఈ నిర్ణయాన్ని సవరించాలని చూస్తోంది. విదేశీ పర్యటనలో కుటుంబ సభ్యులు కూడా రావాలంటే.. ఆటగాళ్లు బీసీసీఐ నుంచి అనుమతి తీసుకోవాలని తెలుస్తోంది.

New Update
kohli bcci

kohli bcci

క్రికెటర్లు విదేశీ టూర్‌లో ఉన్నప్పుడు వారితో పాటు కుటుంబాలను తీసుకువెళ్లకూడదని బీసీసీఐ (BCCI) కండీషన్ పెట్టిన సంగతి తెలిసిందే. ఈ నిర్ణయంపై విరాట్ కోహ్లీ అసంతృప్తి వ్యక్తం చేశాడు. అతనితో పాటు ఇతర సీనియర్ ఆటగాళ్లు కూడా తప్పుబట్టారు. దీంతో ఈ నిర్ణయాన్ని సవరించేందుకు బీసీసీఐ సిద్ధమైనట్లు తెలుస్తోంది. విదేశీ పర్యటనలో తమ కుటుంబ సభ్యులు ఎక్కువకాలం తమతో పాటు ఉండాలనుకునే ఆటగాళ్లు బీసీసీఐ నుంచి అనుమతి కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. బోర్డు తగిన నిర్ణయం తీసుకుంటుందని బీసీసీఐ ఉన్నతాధికారి తెలిపినట్లు సమాచారం. 

ఇది కూడా చూడండి: NASA: సునీతా విలియమ్స్ వచ్చేస్తున్నారు..క్రూ డ్రాగన్ ల్యాండింగ్ లైవ్

ఇది కూడా చూడండి: TG Budget 2025: నేడే తెలంగాణ బడ్జెట్.. ఆ పథకాలకు భారీగా నిధులు?

తక్కువ పర్యటనలకు కుటుంబాలు..

ఇదిలా ఉండగా ఆస్ట్రేలియాతో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో టీమిండియా ఓడిపోవడంతో బీసీసీఐ ఈ రూల్‌ను తీసుకొచ్చింది. ఆటగాళ్లతో కుటుంబాలు విదేశీ పర్యటనలో ఉండటానికి కొన్ని పరిమితలను తీసుకొచ్చింది. తక్కువ రోజులు పర్యటనలకు కుటుంబాలు అవసరం లేదని, ఎక్కువగా కాలం ఉండే పర్యటనలకు మాత్రమే కుటుంబ సభ్యులను తీసుకెళ్లవచ్చని తెలిపింది. టీమిండియా విదేశీ పర్యటనలో 45 రోజులకు పైగా ఉండే సమయంలో ఆటగాళ్లకు వారి భాగస్వాములు, పిల్లలు (18 సంవత్సరాల లోపు) ఒకసారి, రెండు వారాల పాటు కలిసి ఉండే అవకాశం ఉంటుంది. 

ఇది కూడా చూడండి: Horoscope:నేడు ఈ రాశి వారు వాహనాలు నడిపేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి...!

దీనిపై విరాట్ కోహ్లీ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యులు లేకుండా గదిలో ఒంటరిగా కూర్చోని ఏడవాలా? మనకు కఠినమైన పరిస్థితులు వస్తే కుటుంబ సభ్యులను కలిస్తే ఎంతో హాయిగా ఉంటుంది. వారితో గడిపే సమయాన్ని అసలు నేను వదులుకోలేనని విరాట్ కోహ్లీ అన్నాడు. ఈ క్రమంలో బీసీసీ తీసుకున్న నిర్ణయాన్ని సవరించాలని చూస్తున్నట్లు సమాచారం. 

ఇది కూడా చూడండి: USA: వెల్కమ్ హోమ్ టూ సునీతా విలియమ్స్..సేఫ్ గా ల్యాండ్ అయిన వ్యోమగాములు

Advertisment
తాజా కథనాలు