Pakistan Army: పాకిస్థాన్‌లో భారీ ఎన్‌కౌంటర్.. 10 ఉగ్రవాదులు హతం

పాకిస్థాన్‌లో మరోసారి ఉగ్రదాదులు, సైన్యం మధ్య కాల్పులు చోటుచేసుకున్నాయి. ఖైబర్ పఖ్తుంక్వాలో ప్రావిన్స్‌లో తుపాకి తూటాలు పేలాయి. ఈ దాడుల్లో 10 మంది నిషేధిత ఉగ్రసంస్థకు చెందిన ఉగ్రవాదులు మరణించారు. అలాగే పాకిస్థాన్ ఆర్మీ కెప్టెన్‌ కూడా ప్రాణాలు కోల్పోయారు.

New Update
Pakistan Army

Pakistan Army

పాకిస్థాన్‌లో మరోసారి ఉగ్రదాదులు, సైన్యం మధ్య కాల్పులు చోటుచేసుకున్నాయి. ఖైబర్ పఖ్తుంక్వాలో ప్రావిన్స్‌లో తుపాకి తూటాలు పేలాయి. ఈ దాడుల్లో 10 మంది నిషేధిత ఉగ్రసంస్థకు చెందిన ఉగ్రవాదులు మరణించారు. అలాగే పాకిస్థాన్ ఆర్మీ కెప్టెన్‌ కూడా ప్రాణాలు కోల్పోయారు. ఆ ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నట్లు పక్కా సమాచారం రావడంతో గురువారం ఇంటెలిజెన్స్ ఆధారిత ఆపరేషన్‌ (IBO)ను చేపట్టింది. ఈ క్రమంలోనే కాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఆపరేషన్‌లో పాక్ సైన్యాన్ని ముందుండి నడిపించి పోరాడిన కెప్టెన్ హస్నైన్ అఖ్తర్‌ చివరికి ప్రాణాలు కోల్పోయారని ఇంటర్ సర్వీసెస్‌ పబ్లిక్‌ రిలేషన్స్ (ISPR) తెలిపింది.   

Also Read: మరో డిజిటల్‌ అరెస్టు .. రూ.20 కోట్లు కొట్టేసిన సైబర్ కేటుగాళ్లు

Khyber Pakhtunkhwa

అనంతరం చనిపోయిన ఉగ్రవాదుల నుంచి ఆయుధాలు, పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొంది. ఇటీవల ఈ నిషేధిత సంస్థకు చెందిన ఉగ్రవాదులు లా ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెన్సీలతో పాటు, పాక్ పౌరులను లక్ష్యంగా చేసుకుని పలుమార్లు దాడులు చేసి హతమార్చారని తెలిపింది. అందుకే ఖైబర్ పఖ్తుంక్వా ప్రావిన్స్‌లో ఉగ్రవాదులు లేకుండా చేయాలని ఈ ఆపరేషన్ చేపట్టినట్లు చెప్పింది. 

Also Read: అమెరికా విద్యాశాఖ మూసివేత..కీలక ఆదేశాలు జారీ చేసిన ట్రంప్‌!

ఇదిలాఉండగా.. పాకిస్థాన్‌లో ఆ దేశ ఆర్మీ, బలూచ్‌ లిబరేషన్ ఆర్మీ (BLA) మధ్య దాడులు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇటీవల బీఎల్‌ఏ వేర్పాటువాదులు ఏకంగా 400 మంది ప్రయాణిస్తున్న ప్యాసింజర్‌ ట్రైన్‌నే హైజాక్ చేశారు. అనంతరం ప్రయాణికులను వేరేచోటుకి తరలించి నిర్బంధించారు. రంగంలోకి దిగిన పాక్ భద్రతా బలగాలు ఇప్పటిదాకా 155 మంది ప్రయాణికులను రక్షించారు. అలాగే 27 బీఎల్‌ఏ ముష్కరులను హతమార్చారు.  

Also Read: వికలాంగురాలిపై లైంగిక దాడి చేయించిన భర్త.. ఒకేసారి ఐదుగురు కలిసి!

Also Read: వేలంలో రూ.118 కోట్లు పలికిన ఎంఎఫ్ హుస్సేన్ పెయింటింగ్.. ఇందులో అంత ప్రత్యేకత ఏంటో తెలుసా?

 

pakistan-army | terrorist | latest-telugu-news | today-news-in-telugu | international news in telugu

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు