TG Govt Jobs: తెలంగాణలో ఉగాది నుంచి ఉద్యోగాల పండుగ.. 55 వేల ఖాళీల భర్తీకి నోటిఫికేషన్లు.. శాఖల వారీగా లెక్కలివే!

నిరుద్యోగులకు తెలుగు సంవత్సరం ఉగాది సందర్భంగా తెలంగాణ సర్కారు గుడ్ న్యూస్ చెప్పనుంది. రాష్ట్రంలో మరో 55,418 ఉద్యోగాలను భర్తీ చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేసింది. కాంగ్రెస్‌ ప్రభుత్వం15 నెలల కాలంలో 61,579 పోస్టులను భర్తీ చేయాలని భావిస్తోంది.

New Update
tg jobs

Telangana 55,418 jobs Notification soon

నిరుద్యోగులకు తెలుగు సంవత్సరం సందర్భంగా తెలంగాణ సర్కారు గుడ్ న్యూస్ చెప్పనుంది. ఉగాది పండగ తర్వాత రాష్ట్రంలో మరో 55,418 ఉద్యోగాలను భర్తీ చేసేందుకు సర్కారు ప్లాన్ చేస్తోంది. కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2023 డిసెంబరు నుంచి ఇప్పటి వరకు వివిధ శాఖల్లో 58,868 పోస్టులను భర్తీ చేసింది. అయితే గత కొన్నేళ్లుగా ఎదురు చూస్తున్న కారుణ్య నియామకాలను రాబోయే నోటిఫికేషన్ లో భర్తీ చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తోంది. 

Telangana Jobs
Telangana Jobs

Also Read :  గాజాపై ఆగని ఇజ్రాయెల్ దాడులు..85 మంది మృతి

మొత్తం 61,579 పోస్టుల భర్తీ...

ఇప్పటికే మహిళా, శిశు సంక్షేమ శాఖకు సంబంధించిన 6,399 అంగన్వాడీ టీచర్‌, 7,837 హెల్పర్‌ పోస్టులు, రెవెన్యూ శాఖలో 10,954 గ్రామ పరిపాలన అధికారుల నియామకాల నోటిఫికేషన్ త్వరలోనే విడుదల చేయనున్నారు. వీటితోపాటు ఆయా శాఖల్లో మరో 30,228 పోస్టులను భర్తీ చేయాలని భావిస్తున్నారు. అలాగే గ్రూప్‌-1, 2, 3ల్లో ఎంపికైన 2,711 మందికి త్వరలోనే నియామక పత్రాలు అందించి.. కాంగ్రెస్‌ ప్రభుత్వం15 నెలల కాలంలో 61,579 పోస్టులను భర్తీ చేసినట్లు ప్రజలకు చూపించాలని భావిస్తోంది. 

Also Read :  అయోధ్య సాక్షిగా.. కామవాంఛ తీర్చుకుని మహిళను కాటికి పంపిన దుర్మార్గులు!

జాబ్ క్యాలెండర్ ప్రకారం..

ఇక జాబ్ క్యాలెండర్ ప్రకారం.. 55,418 పోస్టులకు నోటిఫికేషన్లు ఇచ్చి వాటిని భర్తీ చేస్తే మొత్తం 1.16 లక్షల ఉద్యోగాల ప్రక్రియ పూర్తికానుంది. ఇక అంగన్వాడీ 14,236 పోస్టుల భర్తీకి సంబంధించిన ఫైలుపై ఆ శాఖ మంత్రి సీతక్క ఇప్పటికే సంతకం చేశారు. దీంతో ఆయా పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ పక్కాగా రానున్నాయి. అలాగే గ్రామ పరిపాలన అధికారి (GPO) పేరుతో10,954 ఉద్యోగాలను ఇవ్వాలని క్యాబినెట్‌ సమావేశంలో నిర్ణయించారు. ఈ ప్రక్రియ త్వరలోనే మొదలుకానుంది. 

Also read :  కర్నూల్‌లో కీచక టీచర్.. బాలికలకు బ్లూ ఫిల్మ్ చూపించి ఏం చేశాడంటే!

ఇప్పటికే వీఆర్వోలుగా పని చేసి ప్రస్తుతం వివిధ శాఖల్లో విధులు నిర్వహిస్తున్న 6000 మందిని జీపీవోలుగా నియమించాలని ప్రభుత్వం యోచిస్తోంది. వీటితోపాటు మరో 4 వేలకుపైగా పోస్టులకు నోటిఫికేషన్‌ విడుదల చేయనున్నారు. ఇక స్కిల్‌ యూనివర్సిటీ, హ్యాండ్లూమ్‌ అండ్‌ టెక్స్‌టైల్‌ ఇనిస్టిట్యూట్‌ లలో అవసరమైన పోస్టులను భర్తీ చేయనున్నారు. ఆర్థిక, న్యాయ శాఖ, సచివాలయం, సమీకృత గురుకులాల్లో దాదాపు 30,228 పోస్టులను భర్తీ చేయాల్సి ఉంది. ఇప్పటికే వీటి భర్తీకోసం ఆర్థిక శాఖతో చర్చలు జరిపిందని, త్వరలోనే శాఖలవారీగా నోటిఫికేషన్లు జారీ చేయనున్నట్లు తెలుస్తోంది. 

Also read :  నా కూతురిపై గ్యాంగ్ రేప్ .. ఆదిత్య ఠాక్రే కారణమంటూ హైకోర్టులో దిశ తండ్రి పిటిషన్

 

 today-news-in-telugu | telangana-jobs | job-notification | latest telangana news | telangana news today | telangana-news-updates | latest-telugu-news | rtv telugu news

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు