Telangana: లడ్డూ ప్రసాదం.. ఆలయ ఈవోలకు దేవాదాయశాఖ కీలక ఆదేశాలు
తెలంగాణ దేవాదాయ శాఖ ఈవోలకు కీలక ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వ రంగ సంస్థ విజయ డెయిరీ నెయ్యిని యాదగిరిగుట్టతో పాటు రాష్ట్రంలోని ఆలయాలు వాడాలని ఈవోలను ఆదేశించింది. ఇప్పటి వరకు చేసుకున్న ఒప్పందాలని రద్దు చేసి జనవరి 1వ తేదీ నుంచి ఉపయోగించాలని తెలిపింది.