Mann ki Baat: మన్‌కీ బాత్‌లో ఏఎన్నార్ ప్రస్తావన.. ఎన్టీఆర్‌ను మర్చిపోయిన మోదీ

ప్రధాని మోదీ మన్‌కీ బాత్ 117వ ఎపిసోడ్‌లో ప్రముఖ దివంగత నటుడు అక్కినేని నాగేశ్వరరావు పేరును ప్రస్తావించారు. తెలుగు సినిమాను ఆయన మరో స్థాయికి తీసుకెళ్లారని కొనియాడారు. అయితే సీనియర్ ఎన్టీఆర్‌ పేరును ప్రస్తావించకపోవడంతో ప్రధానిపై విమర్శలు వస్తున్నాయి.

New Update
Modi And Akkineni nageshwar rao

Modi And Akkineni nageshwar rao

ప్రధాని మోదీ ప్రతి నెల చివరి ఆదివారం నిర్వహించే మన్‌కీ బాత్ కార్యక్రమం 117వ ఎపిసోడ్‌లో ఆయన పలు కీలక విషయాలు పంచుకున్నారు. ఈసారి ప్రముఖ దివంగత నటుడు అక్కినేని నాగేశ్వరరావు పేరును ప్రస్తావించారు. తెలుగు సినిమాకు ఆయన చేసిన కృషిని ప్రశంసించారు. తెలుగు సినిమాను నాగేశ్వర్‌ రావు మరో స్థాయికి తీసుకెళ్లారని కొనియాడారు. ఆయన సినిమాల్లో భారతీయ సంప్రదాయాలు, విలువలను చాలా బాగా చూపించేవారని పేర్కొన్నారు.

 అలాగే బాలీవుడ్ దర్శకుడు తపన్ సిన్హా మూవీస్ కూడా సమజానికి కొత్త బాటలు వేశాయని చెప్పారు. ఇక రాజ్‌కపూర్ తన సినిమాల ద్వారా భారతదేశంలో సున్నితమైన అంశాలను ప్రపంచానికి పరిచయం చేశాయని తెలిపారు.  అయితే తెలుగు చలన చిత్ర పరిశ్రమను మొదటిసారిగా జాతీయ స్థాయికి తీసుకెళ్లిన వాళ్లలో ప్రముఖుంగా వినిపించే పేర్లు నందమూరి తారక రామారావు, అక్కినేని నాగేశ్వర్ రావు. కానీ ప్రధాని మోదీ..  సీనియర్ ఎన్టీఆర్‌ పేరును ప్రస్తావించకుండా కేవలం నాగేశ్వర రావు పేరును ప్రస్తావించడంపై సోషల్ మీడియాలో విమర్శలు వస్తున్నాయి. ప్రధాని ఎన్టీఆర్‌ పేరును కూడా ప్రస్తావిస్తే బాగుండేదని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.   

Also Read: 60 శాతం పాకిస్థాన్ తీవ్రవాదుల్ని హతం చేశాం: ఇండియన్ ఆర్మీ

ఇండియన్ మూవీస్ వైపు ఇప్పుడు ప్రపంచ దేశాలు చూస్తున్నాయని.. తొలిసారిగా వరల్డ్ ఆడియో విజువల్ ఎంటర్‌టైన్మెంట్ సమ్మిట్‌ను వచ్చే ఏడాది భారత్‌లోనే నిర్వహించబోతున్నామని చెప్పారు. ఈ సమ్మిట్‌లో సినిమా ఇండస్ట్రీ, మీడియా రంగాలకు చెందిన ప్రపంచ దేశాల దిగ్గజాలు ఇందులో పాల్గొంటారని తెలిపారు.  అంతేకాదు భారత రాజ్యాంగం ఆమోదించి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఓ ప్రత్యేక వెబ్‌సైట్‌ను రూపొందించామని చెప్పారు. 

పవిత్ర గ్రంథమైన రాజ్యాంగంపై ప్రజలు తమ అభిప్రాయాలను వీడియోలుగా రూపొందించి.. ఈ వెబ్‌సైట్‌లో పంచుకోవాలని పిలుపునిచ్చారు. 75 ఏళ్ల సంబరాల్లో ప్రజను భాగం చేయాలనే ఉద్దేశంతోనే ఈ వెబ్‌సైట్‌ను ఏర్పాటుచేశామని చెప్పారు. అలాగే ఈ వెబ్‌సైట్‌లో అనేక భారతీయ భాషల్లో రాజ్యాంగాన్ని అందుబాటులోకి తీసుకొచ్చామని చెప్పారు. అన్ని భాషల వారు రాజ్యంగంలో అనేక విషయాలను చదివి.. అర్థం కాని అంశాలను కూడా అడగవచ్చని పేర్కొన్నారు.  

Also Read: ఈ ఏడాది రెండో పెళ్లి చేసుకున్న టాలీవుడ్ సెలెబ్రిటీలు వీళ్ళే!

Also Read: పవన్ ను ఇబ్బంది పెట్టకండి.. ఫ్యాన్స్ కు 'ఓజీ' మేకర్స్ రిక్వెస్ట్

 

Advertisment
Advertisment
తాజా కథనాలు