RaasiPhal: మరో రెండో రోజుల్లో 2024 ముగుస్తుంది. ఈ క్రమంలోనే ఇప్పటి వరకు ఎలా ఉన్నప్పటికీ రాబోయే రోజులు ఎలా ఉండబోతున్నాయనే ఆసక్తి అందరిలో ఉంటుంది. ఈ క్రమంలోనే నేడు ఏ రాశి వారికి ఎలా ఉంటుంది? ఎవరికి అదృష్టం కలిసొస్తుంది? ఎవరికి ఆర్థిక పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి? ఎవరిపై శని ప్రభావం ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం.
Aslo Read: Bullet Train: చైనా మరో అద్భుతం.. గంటకు 450 కి.మీ ప్రయాణించగల రైలు ఆవిష్కరణ
మేషం
గొప్పవారి పరిచయం ఏర్పడుతుంది. స్త్రీల మూలంగా లాభం ఉంటుంది. మంచి ఆలోచనలను కలిగి ఉంటారు. బంధు, మిత్రుల నుంచి గౌరవం అందుకుంటారు. కుటుంబ సౌఖ్యం సంపూర్ణంగా పొందుతారు. సత్కార్యాల్లో పాల్గొంటారు. గృహ అవసరాలకు ప్రాధాన్యమిస్తారు.
వృషభం
ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటారు. వృత్తి, ఉద్యోగరంగాల్లో నష్టపోయే అవకాశం ఉంది. కుటుంబంలో మార్పులు కోరుకుంటారు. ఒక మంచి అవకాశాన్ని జారవిడుచుకుంటారు. ఆకస్మిక ధననష్టం పట్ల అప్రమత్తంగా ఉండటం అవసరం.
మిథునం
అన్నికార్యాల్లో విజయాన్ని అందుకుంటారు. అంతటా సౌఖ్యాన్నిపొందుతారు. శత్రుబాధలు ఉండవు. శుభవార్తలు వింటారు. గౌరవ మర్యాదలు ఎక్కువ అవుతాయి అద్భుత శక్తి సామర్థ్యాలను కూడగట్టుకుంటారు. కుటుంబంలో అభివృద్ధితోపాటు ఆకస్మిక ధనలాభం పొందుతారు.
Also Read: DGP Jitendar: తెలంగాణలో పోలీసుల వరుస ఆత్మహత్యలు.. డీజీపీ సంచలన వ్యాఖ్యలు
కర్కాటకం
కుటుంబ విషయాలపై అనాసక్తితో ఉంటారు. గృహంలో మార్పులు జరిగే అవకాశాలు కనపడుతున్నాయి. తలచిన కార్యాలు ఆలస్యంగా జరిగే అవకాశాలు కనపడుతున్నాయి. కొన్ని కార్యాలు రేపటికి వాయిదా వేసుకుంటారు. స్త్రీలతో జాగ్రత్తగా ఉండటం మంచిది.
సింహం
ఆకస్మిక ధనలాభం ఉంటుంది. కుటుంబంలో ఆనందోత్సాహాలు వెల్లివిరుస్తాయి. బంధు, మిత్రులతో కలుస్తారు. సమాజంలో గౌరవం లభిస్తుంది. సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉంటారు. ప్రతి విషయంలో అభివృద్ధి ఉంటుంది. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేరతాయి.
Also Read: New Chief Secretary: నూతన సీఎస్‌గా ఆయనే.. ఫైనల్ చేసిన సీఎం చంద్రబాబు!
కన్య
తలచిన కార్యాలకు ఆటంకాలు ఎదురవుతాయి. స్థిరాస్తులకు సంబంధించిన సమస్యలో జాగ్రత్తగా ఉండటం మంచిది. మోసపోయే అవకాశాలు ఉంటాయి. ఆర్థిక పరిస్థితి ఆందోళనకరంగా మారుతుంది. నూతనకార్యాలు ప్రారంభించకూడదు. ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు.
తుల
సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారు. కుటుంబంలో సుఖసంతోషాలు అనుభవిస్తారు. నూతన వస్తు, ఆభరణాలను పొందుతారు. ప్రయత్నకార్యాలన్నింటిలో విజయం సాధిస్తారు. శుభవార్తలు వింటారు. ధైర్యసాహసాలు ప్రదర్శిస్తారు. ఆకస్మిక ధనలాభం ఉంటుంది.
Also Read: 2024 Top Premium Bikes: ఈ ఏడాది రిలీజ్ అయిన టాప్ ప్రీమియం బైక్స్.. ఫీచర్లు పిచ్చెక్కించాయ్!
వృశ్చికం
అనారోగ్య బాధలతో సతమతమవుతారు. స్థానచలన సూచనలు ఉంటాయి. నూతన వ్యక్తులను కలుస్తారు. కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉండకపోవడంతో మానసిక ఆందోళన చెందుతారు. గృహంలో మార్పులు కోరుకుంటారు. ఆర్థిక ఇబ్బందులు దూరమవతాయి.
ధనుస్సు
గౌరవ మర్యాదలకు లోపముండదు. అనవసర వ్యయప్రయాసలుంటాయి. వృధా ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు. మానసిక ఆందోళనతోనే కాలం గడుపవలసి వస్తుంది. బంధుమిత్రులతో వైరం ఏర్పడకుండా జాగ్రత్తవహించాలి. శారీరకంగా బలహీనులవుతారు. విందులు, వినోదాల్లో పాల్గొంటారు.
మకరం
కోపాన్ని అదుపులో ఉంచుకోవడం మంచిది. మానసిక ఆందోళనను తొలగించడానికి దైవధ్యానం అవసరం. శారీరిక అనారోగ్యంతో బాధపడుతారు. కుటుంబ విషయాలు సంతృప్తికరంగా ఉండవు. వృధా ప్రయాణాలు ఎక్కువవుతాయి. ధనవ్యయం తప్పదు.
కుంభం
కొన్ని ముఖ్యమైన పనులు వాయిదా వేసుకుంటారు. మానసిక చంచలంతో ఇబ్బంది పడతారు. సోమరితనం ఆవహిస్తుంది. పిల్లలపట్ల మిక్కిలి జాగ్రత్తవహిస్తారు. కొన్ని మంచి అవకాశాలను కోల్పోతారు. ఆర్థిక పరిస్థితిలో మార్పులు ఉండవు.
మీనం
ధర్మకార్యాలు చేయడంలో ఆసక్తి పెరుగుతుంది. దైవదర్శనం చేసుకుంటారు. కుటుంబ సౌఖ్యం ఉంటుంది. మానసిక ఆనందాన్ని అనుభవిస్తారు. పేరు ప్రతిష్ఠలు లభిస్తాయి. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. శుభవార్తలు వింటారు. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేర్చుకుంటారు.