Borewell: బోరుబావిలో పడిన బాలుడు.. 16 గంటలు శ్రమించినా.. !

మధ్యప్రదేశ్‌లోని గుణ జిల్లాలో శనివారం సాయంత్రం సుమిత్ మీనా(10) అనే బాలుడు 140 అడుగుల బోరుబావిలో పడిన సంగతి తెలిసిందే. 16 గంటల పాటు శ్రమించిన రెస్క్యూ టీం అతడిని బయటికి తీశాయి. వెంటనే ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఆ బాలుడు మరణించాడు.

New Update
Borewell

Borewell

మధ్యప్రదేశ్‌లోని గుణ జిల్లాలో శనివారం సాయంత్రం సుమిత్ మీనా (10)  అనే బాలుడు 140 అడుగుల బోరుబావిలో పడిన సంగతి తెలిసిందే. 16 పాటు శ్రమించిన సహాయక బృందాలు ఆ బాలుడిని బయటకి తీశాయి. అపస్మారక స్థితిలో ఉన్న అతడిని వెంటనే ఆస్పత్రికి తరలించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. చికిత్స పొందుతూ ఆ బాలుడు మృతి చెందడంతో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఇక వివరాల్లోకి వెళ్తే గుణ జిల్లాలో పిప్లియా గ్రామంలో శనివారం సాయంత్రం 5 గంటలకు సుమిత్ మీనా ఆడకుంటూ పక్కనే ఉన్న 140 అడుగుల బోరుబావిలో పడిపోయాడు. 

Also Read: మన్‌కీ బాత్‌లో ఏఎన్నార్ ప్రస్తావన.. ఎన్టీఆర్‌ను మర్చిపోయిన మోదీ

ఇది గమనించిన కుటుంబ సభ్యులు అధికారులకు సమాచారం అందించారు. ఘటనాస్థలానికి చేరుకున్న రెస్క్యూ టీం సహాయక చర్యలు ప్రారంభించారు. బోరుబావికి కొంత దూరంలో గొయ్యి తీశారు. దాదాపు 16 గంటల పాటు శ్రమించి బాలుడిని కాపాడారు. కానీ అప్పటికే బాలుడు అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. ఆస్పత్రికి తరలించగా చికిత్స తీసుకుంటూ మృతి చెందాడు. దీనికి సంబంధించి గుణ జిల్లా చీఫ్ మెడికల్ అండ్ హెల్త్ అధికారి డా.రాజ్‌ కుమర్ మాట్లాడారు. బాలుడు రాత్రంతా చల్లటి వాతావరణంలో ఉండటం వల్ల కాళ్లు, చేతులు తడిచి వాచిపోయాయని చెప్పారు. దీనివల్ల అతడి శరీర భాగాలు స్తంభించియాయని.. మెరుగైన వైద్యం అందించినా కూడా సమయం దాటిపోవడం వల్ల బాలుడిని రక్షించుకోలేకపోయామని తెలిపారు.     

Also Read:  దేశాన్ని ముంచేసిన విషాదాలు ఇవే.. 2024 ఓ చేదు జ్ఞాపకం!

ఇదిలా ఉండగా.. ఇటీవల రాజస్థాన్‌లోని కోఠ్‌పుత్లీ-బెహ్రర్ జిల్లాలో చేతన అనే చిన్నారి పొలంల ఆడుకుంటూ 700 అడుగుల బోరుబావిలో పడిపోయిన సంగతి తెలిసిందే. 150 అడుగుల వద్ద చిన్నారిని బయటకు తీసేందుకు గత ఏడు రోజులుగా సహాయక సిబ్బంది శ్రమిస్తూనే ఉన్నారు. తమ కూతుర్ని త్వరగా రక్షించాలని ఆమె తల్లిదండ్రులు అధికారులను వేడుకుంటున్నారు. ఆ చిన్నారని బయటకు తీసేందుకు ర్యాట్ హోల్ మైనర్స్ సాయం తీసుకుంటున్నట్లు అధికారులు చెప్పారు. 

Also Read:పవన్ ను ఇబ్బంది పెట్టకండి.. ఫ్యాన్స్ కు 'ఓజీ' మేకర్స్ రిక్వెస్ట్

Advertisment
తాజా కథనాలు