Jimmy Carter: అమెరికా మాజీ అధ్యక్షుడు జిమ్మీ కార్టర్ మృతి

అమెరికా మాజీ ప్రెసిడెంట్ జిమ్మీ కార్డర్ తుది శ్వాస విడిచారు. యునైటెడ్ స్టేట్స్‌కి 39వ ప్రెసిడెంట్‌గా సేవలు అందించిన జిమ్మీ గత రెండు నెలల క్రితమే వందేళ్లు పూర్తి చేసుకున్నారు. డెమోక్రాటిక్ పార్టీ సభ్యుడు అయిన జిమ్మీ నోబెల్ శాంతి బహుమతి కూడా పొందారు.

New Update
Jimmy Carter

Jimmy Carter Photograph: (Jimmy Carter)

అమెరికా మాజీ అధ్యక్షుడు జిమ్మీ కార్టర్ మృతి చెందారు. యునైటెడ్ స్టేట్స్‌కి 39వ ప్రెసిడెంట్‌గా జిమ్మీ సేవలు అందించారు. 1924 అక్టోబర్ 1న జన్మించిన జిమ్మీ కార్డర్ డిసెంబర్ 29న మరణించారు. అంటే గత రెండు నెలల క్రితమే జిమ్మీకి వందేళ్లు పూర్తయ్యాయి. డెమోక్రాటిక్ పార్టీ సభ్యుడు అయిన జిమ్మీ కార్టర్.. 2002లో నోబెల్ శాంతి పురస్కారం కూడా దక్కించుకున్నారు. ఎక్కువ రోజులు జీవించిన ప్రెసిడెంట్‌గా అమెరికాలో రికార్డు సృష్టించారు.

ఇది కూడా చూడండి: Ap: జనసేనలోకి తమ్మినేని సీతారాం..క్లారిటీ ఇచ్చేసారుగా..!

ఇది కూడా చూడండి: ప్రశ్నపత్రం లీకేజీ.. అభ్యర్థులపై పోలీసుల లాఠీఛార్జీ

పల్లీ వ్యాపారం నుంచి రాజకీయాల వైపు..

జార్జియాలో పుట్టిన కార్టర్ 1977 నుంచి 1981 మధ్య వరకు అమెరికాకు అధ్యక్షుడిగా పనిచేశారు. జిమ్మీ 1946లో యూఎస్ నవల్ అకాడమీలో చేరారు. ఆ తర్వత యూఎస్ నేవీ సబ్‌మెరైన్ సర్వీసులో పనిచేశారు. ఆ తర్వాత పల్లీ వ్యాపారాన్ని ప్రారంభించి.. రాజకీయాల వైపు అడుగు వేశారు. 1976లో రిప్లబిక్ పార్టీ ప్రెసిడెంట్ అయిన గెరాల్డ్ ఫోర్డ్‌పై జిమ్మీ గెలిచి, యూఎస్‌ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు చేపట్టారు. గతేడాది జిమ్మీ భార్య రోసలెన్ 96 ఏళ్ల వయస్సులో మృతి చెందింది. 

ఇది కూడా చూడండి:  Rythu Bharosa: రైతు భరోసాపై భట్టి విక్రమార్క సంచలన కామెంట్స్

ఇది కూడా చూడండి:  ఆరోజు 'పుష్ప' నిర్మాతలే థియేటర్ తీసుకున్నారు.. నోటీసులపై సంధ్య థియేటర్ రిప్లై

Advertisment
తాజా కథనాలు