Rama Navami : భక్తులకు టీజీఎస్ఆర్టీసీ గుడ్న్యూస్.. ఇంటికే భద్రాద్రి రాములోరి తలంబ్రాలు..
శ్రీరామ నవమి సందర్భంగా శ్రీ సీతారామచంద్రుల కల్యాణానికి భద్రచలం ముస్తాభవుతోంది. ఇప్పటికే కళ్యాణానికి అంకురార్పణ చేయడంతో పాటు రాములోరి కళ్యాణానికి అవసరమైన తలంబ్రాలు కలిపే కార్యక్రమం మొదలైంది. ఈ సందర్భంగా భక్తులకు తెలంగాణ ఆర్టీసీ గుడ్ న్యూస్ చెప్పింది.