Telangana Rain Update: తెలంగాణలో భారీ వర్షం.. ఈ జిల్లాల్లో దంచుడే దంచుడు
తెలంగాణలోని పలు జిల్లాల్లో వర్షం దంచికొడుతోంది. యాదాద్రి భువనగిరి, జనగాం, వరంగల్, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, సూర్యాపేట ప్రాంతాల్లో భారీగా వర్షపాతం నమోదవుతోంది. రాబోయే కొన్ని గంటల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.