/rtv/media/media_files/2025/09/21/heavy-rains-2025-09-21-17-19-25.jpg)
TG Rain Alert
నైరుతి రుతుపవనాల ప్రభావంతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాల వల్ల చాలా ప్రాంతాల్లో జనజీవనం స్తంభించిపోయింది. నదులు, వాగులు, చెరువులు పొంగిపొర్లుతున్నాయి. దీంతో అనేక లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పలు జిల్లాల్లోని రోడ్లు, రైల్వే ట్రాక్‌లు నీట మునగడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. మరిన్ని వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తున్నారు. తాజాగా తెలంగాణలో రానున్న రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IMD) హెచ్చరించింది. ఈ మేరకు రాష్ట్రంలోని 20 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. హైదరాబాద్, రంగారెడ్డి, ఆదిలాబాద్, భద్రాద్రి, భూపాలపల్లి, కామారెడ్డి, కరీంనగర్, మేడ్చల్, ములుగు, మెదక్, మహబూబ్ నగర్, వరంగల్, సూర్యాపేట, సిద్దిపేట, సంగారెడ్డి, వికారాబాద్, నిజామాబాద్ జిల్లాలతో పాటు మరికొన్ని జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండి నివేదిక పేర్కొంది. ఇప్పటికే ఆదిలాబాద్, హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి.
20 జిల్లాలకు ఎల్లో అలర్ట్:
ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్ని జిల్లాల కలెక్టర్లను మరియు సంబంధిత అధికారులను అప్రమత్తం చేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అధికారులు నిరంతరం పరిస్థితిని పర్యవేక్షించాలని ఆదేశించారు. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల్లో నివసించే ప్రజలను అవసరమైతే సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సూచించారు. రోడ్లపైకి వరద నీరు చేరే ప్రాంతాలను గుర్తించి ముందుగానే ట్రాఫిక్‌ను నిలిపివేయాలని చెప్పారు.
ఇది కూడా చదవండి: అయ్యో బిడ్డలు.. ఆడుకోవడానికి వెళ్లి అనంతలోకాలకు.. విషాదాంతమైన నెల్లూరు చిన్నారుల మిస్సింగ్!
విద్యుత్ శాఖ కూడా ప్రత్యేక శ్రద్ధ వహించాలని.. కరెంట్ సరఫరాలో అంతరాయం లేకుండా చూసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. వేలాడుతున్న వైర్లను తొలగించి ఎలాంటి ప్రాణనష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. దసరా సెలవుల సందర్భంగా విద్యా సంస్థలు కూడా అప్రమత్తంగా ఉండాలని కోరారు. హైదరాబాద్‌లో GHMC, NDRF, SDRF బృందాలు సిద్ధంగా ఉండాలని ముఖ్యమంత్రి సూచించారు. ప్రజలు అత్యవసరం అయితే తప్ప వర్షం సమయంలో బయటకు రావద్దని హెచ్చరించారు. ఈ వర్షాల నేపథ్యంలో ప్రజలు, అధికారులు సమన్వయంతో వ్యవహరించాలని ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది.
ఇది కూడా చదవండి: అకస్మాత్తుగా అలా అనిపిస్తోందా..? ఇది SADకి సంకేతం.. అంటే ఏంటో తెలుసా..?