AP, TG Rains: అల్పపీడనం ఎఫెక్ట్.. తెలంగాణ, ఏపీలో భారీ వర్షాలు!

అల్పపీడనం ప్రభావం దక్షిణ ప్రాంతాలకే పరిమితం కావడంతో ఉత్తర కోస్తాంధ్రలో మాత్రం పొడి వాతావరణం కొనసాగుతుందని వాతావరణ శాఖ వెల్లడించింది. కోస్తాంధ్ర, రాయలసీమలో రాత్రి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే మూడు నుంచి ఆరు డిగ్రీలు తక్కువగా నమోదయ్యాయి.

New Update
Rains

AP and TG Rains

అల్పపీడన ప్రభావంతో తెలంగాణ, ఏపీలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. దక్షిణ బంగాళాఖాతంలో శ్రీలంక సమీపంలో శనివారం ఏర్పడిన అల్పపీడనం పశ్చిమ దిశగా తమిళనాడు వైపు కదులుతుందని వాతావరణ శాఖ ప్రకటించింది. దీని ప్రభావంతో బంగాళాఖాతం నుంచి తూర్పు తమిళనాడు మీదుగా ఆనుకుని ఉన్న దక్షిణ కోస్తా, రాయలసీమ వైపు వర్షాలు విస్తరించే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలుపుతున్నారు.

వర్షపాతం అంచనాలు..

నేడు దక్షిణ కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో అనేక చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. సోమవారం నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో అతి భారీ వర్షాలు, ప్రకాశం, చిత్తూరు, అన్నమయ్య జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. నవంబర్ 18న నెల్లూరు, తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో భారీ వర్షాలు కొనసాగే అవకాశం ఉంది.  అల్పపీడనం ప్రభావం దక్షిణ ప్రాంతాలకే పరిమితం కావడంతో ఉత్తర కోస్తాంధ్రలో మాత్రం పొడి వాతావరణం కొనసాగుతుందని వాతావరణ శాఖ వెల్లడించింది. వాయువ్య భారతం నుంచి గాలులు పెరగడం వల్ల శనివారం కోస్తాంధ్ర, రాయలసీమలో రాత్రి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే మూడు నుంచి ఆరు డిగ్రీలు తక్కువగా నమోదయ్యాయి. 

ఇది కూడా చదవండి:  బిగ్ రెయిన్ అలర్ట్.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు

అరకులోయలో 7 డిగ్రీలు, డుంబ్రిగూడలో 7.6 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రానున్న రెండు రోజుల్లో చలి గాలులు కొనసాగుతాయని వాతావరణ శాఖ తెలిపింది. ప్రస్తుత అల్పపీడనం రాగల 24 గంటల్లో పశ్చిమ-వాయువ్య దిశగా నెమ్మదిగా కదులుతుందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. అంతేకాక నవంబర్ 21న ఆగ్నేయ బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వెల్లడించారు. దీని ప్రభావంతో ఈ నెల 24 నుంచి 27 మధ్య కోస్తా, రాయలసీమ జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు. మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని, లోతట్టు ప్రాంతాల ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు.

ఇది కూడా చదవండి: తెలుగు రాష్ట్రాల ప్రజలకు బిగ్ అలర్ట్.. మళ్లీ భారీ వర్షాలు.. ఇక దంచుడే దంచుడు!

Advertisment
తాజా కథనాలు