/rtv/media/media_files/2025/04/05/IZlt50jNjbovaEaBGvoY.jpg)
Rain Alert For Telangana
Hyderabad Rains: హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో ఈ రోజు ఉదయాన్నే వర్షం మొదలైంది. నిన్న రాత్రి నుంచి మబ్బులు కమ్ముకుని చల్లబడిన వాతావరణం ఈ రోజు ఉదయం వర్షంతో మరింత చల్లబడింది. ఉదయం నుంచే చిన్నగా ప్రారంభమైన వర్షం ఆ తర్వాత జోరందుకుంది.
Also Read: Balochistan: మమ్మల్ని స్వతంత్ర దేశంగా గుర్తించండి..బలూచ్ నాయకుడి భావోద్వేగ పోస్ట్
రామంతాపూర్, ఉప్పల్, తార్నాక, జాబ్లీహిల్స్, బంజారాహిల్స్, అత్తాపూర్, మెహిదీపట్నం, ఫలక్‌నుమా, అల్వాల్, సికింద్రాబాద్, ఓల్డ్ సిటీ, చింతల్ తదితర ప్రాంతాల్లో వాన పడుతోంది. నగర వ్యాప్తంగా మేఘాలు కమ్ముకోవడంతో మిగతా ప్రాంతాల్లోనూ వర్షం కురిసే అవకాశం కనిపిస్తోంది. అటు మెదక్, సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లోనూ వర్షం కురుస్తోంది.
Ind-Pak: మోదీ వ్యాఖ్యలు రెచ్చగొట్టేలా ఉన్నాయి..పాక్ విదేశాంగ శాఖ
హైదరాబాద్ లో రానున్న రెండు నుంచి మూడు గంటల్లో భారీగావర్షం కురుస్తుందని వాతావరణ కేంద్రం అలర్ట్ ను జారీ చేసింది.ఈ క్రమంలో జీహెచ్ఎంసీ అప్రమత్తమైంది. లోతట్టు ప్రాంతాల ప్రజలకు అలర్ట్ గా ఉండాలని చెప్పింది. ఆఫీసులకు వెళ్లేవారు.. మ్యాన్ హోళ్లు, నాళాల దగ్గర జాగ్రత్తగా వెళ్లాలని సూచించింది. అత్యవసరం అయితే.. తప్ప బైటకు రావొద్దని అధికారులు పలు సూచనలు చేశారు.
ఇది కూడా చూడండి: IPL ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. మిగిలిన మ్యాచ్‌ల షెడ్యూల్ రిలీజ్ చేసిన BCCI
ఇది కూడా చూడండి:ఇప్పటివరకూ చూడని విధంగా మోదీ ఉగ్రరూపం.. పాక్‌ను ఏం చేయబోతున్నాడంటే..?
Follow Us