Pak: బలూచిస్తాన్ లో మారణ హోమం..41 మంది మృతి
పాకిస్తాన్ లోని బెలూచిస్తాన్ ప్రావిన్స్ ఆర్మీ, ఉగ్రవాదుల మధ్య గొడవలతో రగిలిపోతోంది. వీరి మధ్య జరుగుతున్న కాల్పుల్లో 24 గంటల్లో 18 మంది భద్రతా సిబ్బంది, 23 మంది ఉగ్రవాదులు మరణించారు.
పాకిస్తాన్ లోని బెలూచిస్తాన్ ప్రావిన్స్ ఆర్మీ, ఉగ్రవాదుల మధ్య గొడవలతో రగిలిపోతోంది. వీరి మధ్య జరుగుతున్న కాల్పుల్లో 24 గంటల్లో 18 మంది భద్రతా సిబ్బంది, 23 మంది ఉగ్రవాదులు మరణించారు.
పాకిస్తాన్‌లోని ఖైబర్ పఖ్తుంఖ్వాలో ఉగ్రవాదులు దాడి చేశారు. కదులుతున్న బస్సుల మీద విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. దీంతో ఓ పోలీసు అధికారితో సహా 50 మంది మరణించారు.
పదేళ్ల తర్వాత ఐసీస్ చేరనుంచి విడుదలైన 'జియా అమీన్ సిడో' తాను ఎదుర్కొన్న భయానక అనుభవాలను వెల్లడించింది. యజిదీ శిశువులను చంపి, వారి మాంసం తమకు వండిపెట్టారని చెప్పింది. తన ఇద్దరు పిల్లలు ఇంకా ఐసీస్ చేతిలోనే ఉన్నారంటూ కన్నీరుపెట్టుకుంది.
పశ్చిమాఫ్రికా దేశం బుర్కినా ఫాసోలో పెను విషాదం చోటుచేసుకుంది. బర్సాలోగా అనే పట్టణంలో ఉగ్రవాదులు దారుణానికి పాల్పడ్డారు. కొన్ని గంటల్లోనే దాదాపు 600 మంది ప్రజలను కాల్చి చంపేశారు. ఆగస్టులో జరిగిన ఈ భయానక ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
జమ్మూ-కశ్మీర్లో ఉగ్రవాదులను సమూలంగా ఏరివేయడానికి నిర్ణయించుకుంది భారత ఆర్మీ. దీని కోసం ఆపరేషన్‌ను మొదలుపెట్టింది. పీఎంవో ఆపరేషన్ సర్ప వినాశ్ 2.0 పేరుతో ఉగ్రవాదులను మట్టుపెట్టనుంది భారత ఆర్మీ.
జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదులు రాజౌరీ గుండా ప్రాంతంలో ఆర్మీ పోస్ట్‌పై దాడులకు పాల్పడ్డారు. సోమవారం తెల్లవారుజామున 3.30 AM గంటలకు కాల్పులు జరిగాయి. అప్రమత్తమైన భద్రతాబలగాలు ఎదురుకాల్పులు చేశాయి. ఈ దాడుల్లో ఓ జవాన్‌కు గాయాలయ్యాయి.
ఉత్తర కశ్మీర్ కుప్వారా జిల్లాలోని కెరాన్ సెక్టార్లో కెరాన్ సరిహద్దు ప్రాంతంలోని భారత్-పాకిస్థాన్ నియంత్రణ రేఖ సమీపంలో కాల్పులు చోటు చేసుకున్నాయి. ఆర్మీకి చెందిన 6 ఆర్ఆర్, ఎస్ఓజీ సైనికులు, స్థానిక పోలీసులు సంయుక్త ఆపరేషన్‌లో ఇద్దరు ఉగ్రవాదులను మట్టుబెట్టారు.
జమ్మూ-కశ్మీర్లో కుప్వారా జిల్లా కేరాన్ సెక్టార్ సరిహత్తుల్లో భరత జవాన్లు ముగ్గురు ఉగ్రవాదులను హతమార్చిన విషయం తెలిసిందే. అయితే దీని వెనుక చాలా పెద్ద ప్లానే ఉందని చెబుతున్నారు కేరాన్ సెక్టర్ బ్రిగేడియర్ ఎన్ఆర్ కుల్కర్ణి. అమర్నాథ్ యాత్రలో కల్లోలం సృష్టించాలనుకున్నారని తెలిపారు.