Manipur:మణిపూర్‌లో కాల్పులు..కమాండోను కాల్చి చంపిన ఉగ్రవాదులు
మణిపూర్‌లో ఈరోజు తెల్లవారుఝామున ఉన్నట్టుండి ఉగ్రవాదులు విరుచుకుపడ్డారు. రెండుసార్లు కాల్పులు జరిపారు. ఇందులో మణిపూర్ కమాండో ప్రాణాలు కోల్పోయారు. మరికొంత మంది సైనికులు గాయపడ్డారు.
మణిపూర్‌లో ఈరోజు తెల్లవారుఝామున ఉన్నట్టుండి ఉగ్రవాదులు విరుచుకుపడ్డారు. రెండుసార్లు కాల్పులు జరిపారు. ఇందులో మణిపూర్ కమాండో ప్రాణాలు కోల్పోయారు. మరికొంత మంది సైనికులు గాయపడ్డారు.
పాకిస్తాన్‌లోని బలూచిస్థాన్ ప్రాంతంలో త్రీవ్రవాద స్థావరాలను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ దాడులు చేస్తోంది. జైషే అల్ అదిల్ కు చెందిన రెండు ప్రధాన కార్యాలయాల మీద డ్రోన్లు, క్షిపణులతో విరుచుకుపడింది. అయితే ఈ దాడులను పాకిస్తాన్ తీవ్రంగా ఖండిస్తోంది. తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరిస్తోంది.
ప్లీజ్ మమ్మల్ని ఏం చేయొద్దు...నన్ను కాల్చొద్దు అంటూ టీవీ లైవ్‌లో న్యూస్ ప్రెజెంటర్ వేడుకొన్నాడు. భయంతో వణికిపోయాడు. ఈక్ఎడార్లో మొహానికి ముసుగు ధరించిన కొందరు దుండగులు అలజడి సృష్టించారు. అక్కడి అధ్యక్షుడు నోబోవా దేశంలో అత్యవసర పరిస్థితి విధించాక ఈ ఘటన జరిగింది.
నిన్న జమ్మూ-కాశ్మీర్ లోని ఫూంచ్ లో ఉగ్రవాదుల దాడి ప్రీప్లాన్డ్ అని చెబుతున్నారు భారత సైన్యాధికారులు. ముందుగా దాడి ప్రాంతాన్ని రెక్కీ నిర్వహించి.. ఆ తర్వాత మూల మలుపు వద్ద కొండల్లో దాక్కొని దాడులు చేసినట్లు భద్రతా అధికారులు గుర్తించారు.
జమ్మూ కశ్మీర్లో మరోసారి కాల్పుల మోత మోగింది. కుల్గాం అనే జిల్లాలోకి ఉగ్రవాదులు చొరబడటంతో అప్రమత్తమైన భద్రతా బలగాలు ఆపరేషన్ చర్యలు కొనసాగించాయి. ఈ ఘర్షణలో భద్రతా బలగాలు 5గురు ఉగ్రవాదుల్ని హతం చేశాయి. మృతులు లష్కరే తోయిబాకు చెందినవారని అధికారులు తెలిపారు.
పాకిస్థాన్ నుంచి భారత్‌లోకి అక్రమంగా చొరబడేందుకు యత్నించిన ఐదుగురు ఉగ్రవాదుల్ని భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. సరిహద్దు అవతలి నుంచి చొరబాటుకు యత్నించిన ఐదుగురు ఉగ్రవాదుల్ని కాల్చేశాయి. పోలీసులు, సైన్యం సంయుక్త ఆపరేషన్‌తో ముష్కరుల కుట్రను భగ్నం చేశారు. ఇందులో హతమైన ఉగ్రవాదులకు లష్కరే తోయిబా అనే ఉగ్రసంస్థతో సంబంధాలు ఉన్నట్లు తెలుస్తోంది.
భారత్ లో అల్లర్లు చేయడానికి పక్క దేశం పాకిస్తాన్ ఎప్పుడూ ఎదురు చూస్తుంటుంది. ఉగ్రవాదులను తయారు చేసి,వాళ్ళను ఇండియాలోకి పంపించి...విధ్వంసం సృష్టించడానికి ప్రయత్నాలు చేస్తూనే ఉంటుంది. మరోసారి పాక్ ఇలాంటి చర్యలకు పాల్పడడానికి చూస్తోందని నిఘా వర్గాలు చెబుతున్నాయి. దీని కోసం ఐఎస్ఐ పాక్ ఉగ్రవాదులకు అత్యాధునిక చైనా ఆయుధాలను అందిస్తోందని హెచ్చరిస్తున్నారు.
జమ్మూకశ్మీర్ లోని పుల్వామాలో భద్రతాదళాలకు ఉగ్రవాదులకు మధ్య ఎన్ కౌంటర్ జరిగింది. ఈ ఎన్ కౌంటర్ లో ఇద్దరు ఉగ్రవాదులను భద్రతాదళాలు మట్టుబెట్టాయి. టెర్రరిస్టులు ఓ ఇంట్లో దాక్కుతున్నట్లు పక్కాసమాచారంలో దాడి చేశాయి భద్రతాదళాలు. ఆదివారం అర్థరాత్రి జరిగిన ఈ ఆపరేషన్ లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు.