/rtv/media/media_files/2025/02/02/kuAcanRcMI6c9PGKzo32.jpg)
Pak Army, Terrorists attacks
పాకిస్తాన్‌లోని బలూచిస్తాన్, ఖైబర్ ఫఖ్తుంఖ్వా ప్రావిన్సులు గత కొంత కాలంగా ఉగ్రవాద దాడులతో సతమతమవుతున్నాయి. బలూచిస్తాన్ ప్రాంత విముక్తి కోసం బలూచ్ లిబరేషన్ ఆర్మీ బీఎల్ఏ కొంత కాలంగా పోరాడుతోంది. ముఖ్యంగా పాక్ సైనికులు, అధికారుల్ని టార్గెట్ గా దాడులు చేస్తోంది. పాక్‌లో అతిపెద్ద ప్రావిన్సుగా ఉన్న బలూచిస్తాన్ నుంచే చైనా-పాక్ ఎకనామిక్ కారిడార్ సీపెక్ వెళ్తోంది. ఈ ప్రాంతంలో చైనా గ్వాదర్ పోర్ట్ ను కూడా నిర్మిస్తోంది. దీన్ని కూడా బీఏెల్ టార్గెట్ చేస్తోంది. గత ఏడాది కాలంలో పాక్ వ్యాప్తంగా 444 ఉగ్రదాడులు జరిగాయి. ఇందులో 685 మంది భద్రతా సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు.
తాజాగా ఆర్మీ, ఉగ్రవాదులకు మధ్య మళ్ళీ దాడులు జరిగాయి. వీరి మధ్యా జరుగుతున్న కాల్పుల్లో 24 గంటల్లో 18 మంది భద్రతా సిబ్బంది, 23 మంది ఉగ్రవాదులు మరణించారు. మరికొంత మంది సైనికులు తీవ్రంగా గాయపడ్డారు. నిన్న హర్నాయ్ జిల్లాలో జరిగిన ఒక ఆపరేషన్‌లో, పాక్ సైన్యానికి ఉగ్రవాదులకు మధ్య కాల్పులు జరిగాయి. ఇందులో 11 మంది ఉగ్రవాదుల్ని మట్టుబెట్టడమే కాకుండా వారి స్థావరాలను నాశనం చేసినట్లు పాక్ ఆర్మీ ప్రకటించింది. అంతకు ముందు రోజు కలత్‌లోని మాంగోచర్ ప్రాంతంలో రోడ్డు అడ్డగించడానికి ఉగ్రవాదులు ప్రయత్నించారు. అయితే వీటని పాకి ఆర్మీ సాగనివ్వలేదు. అప్పుడు జరిగిన ఘర్షణల్లో 12 మంది ఉగ్రవాదులు హతమయ్యారు. గత 24 గంటల్లో బలూచిస్తాన్‌లో వివిధ ఆపరేషన్లలో మొత్తం 23 మంది ఉగ్రవాదులను నరకానికి పంపారు అని పాక్ సైనికాధికారి ఒకరు వివరాలు తెలిపారు. అయితే, ఈ దాడులకు ఏ ఉగ్రవాద సంస్థ కూడా బాధ్యత వహించలేదు.
మరోవైపు బలూచిస్తాన్ లో పరిస్థితిని సమీక్షించేందుకు పాకిస్తాన్ ఆర్మీ ఛీప్ ఆసిమ్ మునీర్ అక్కడకు వెళ్ళారు. బలూచిస్తాన్ ముఖ్యమంత్రి సర్ఫ్రాజ్ బుగ్టి , గవర్నర్ షేక్ జాఫర్ ఖాన్ మండోఖైల్ తో కలిసి సైనికుల అంత్యక్రియలలో ప్రార్థనలు చేశారు. క్వెట్టా మిలిటరీ ఆస్పత్రితో గాయపడి చికిత్స పొందుతున్న సైనికులను పరామర్శించారు.
Also Read: USA: కెనడా, మెక్సికో దిగుమతి సుంకాల ఉత్తర్వులపై సంతకం..ట్రంప్