Pakistan: బస్సు మీద ఉగ్రవాదుల దాడి..50 మృతి

పాకిస్తాన్‌లోని ఖైబర్ పఖ్తుంఖ్వాలో ఉగ్రవాదులు దాడి చేశారు. కదులుతున్న బస్సుల మీద విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. దీంతో ఓ పోలీసు అధికారితో సహా 50 మంది మరణించారు. 

New Update
bus

Terrorists Attack on Bus: 

పాకిస్థాన్‎లో ఉగ్రవాదులు మరోసారి దారుణానికి ఒడిగట్టారు. ప్రయాణికులతో వెళ్తోన్న బస్సులను లక్ష్యంగా చేసుకుని విచక్షణరహితంగా కాల్పులకు పాల్పడ్డారు. ఈ కాల్పుల్లో 50 మంది సామాన్య ప్రజలు మరణించారు. మరో 29 మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. చనిపోయిన వారిలో ఓ పోలీస్ అధికారి కూడా ఉన్నారు. అంతేకాదు ఇందులో మహిళలు, పిల్లలు కూడా పెద్ద సంఖ్యలో ఉన్నారు. ఖుర్రం గిరిజన జిల్లాలోని ఖైబర్ పఖ్తుంఖ్వాలో  ఈ దాడి జరిగింది. పెషావర్ నుండి పరాచినార్‌కు, పరాచినార్ నుంచి పెషావర్‌‌కు వెళుతున్న రెండు బస్సుల ఉగ్రవాదులు మీద కాల్పులు జరిపారు.

Also Read: ఆ వీడియో చూపించి బాలికపై అత్యాచారం.. చివరికి ఏం జరిగిందంటే?

ఘటన జరిగిన వంటనే పోలీసులు అధికారులు అక్కడకు చేరుకున్నారు. చనిపోయిన వారిలో 14 మందికి ఎలాంటి గుర్తింపు కార్డులు లేవని, అందుకే వారిని ఇంకా గుర్తించలేదని వారి బంధువులను సంప్రదించేందుకు ప్రయత్నిస్తున్నామని అధికారులు తెలిపారు. ఈ ఘటనను పాకిస్తాన్ అధ్యక్షుడు అసిఫ్ అలీ జర్దారీ తీవ్రంగా ఖండించారు. మృతుల కుటుంబాలకు ఆయన సంతాపం తెలిపారు. మరోవైపు, అమాయక ప్రయాణీకులపై దాడి చేయడం పిరికితనం, అమానవీయ చర్య అని పీపీపీ పార్టీ సోషల్ మీడియా పోస్ట్‌లో పేర్కొంది. ఈ ఘటనకు బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించాలని కోరింది. మరోవైపు మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. క్షతగాత్రుల్లో చాలా మంది పరిస్థితి విషయంగా ఉందని డాక్టర్లు చెబుతున్నారు. ఇక కాల్పుల మీద ఇప్పటివరకూ ఏ గ్రూపు బాధ్యత తీసుకోలేదు. 

Also Read: AP:  ఏపీలో ఎన్టీపీసీ 1, 87,00 కోట్ల ఒప్పందం..లక్షమందికి ఉద్యోగాలు

Also Read: అమెరికాలో సొంత తుపాకీ పేలి హైదరాబాద్‌ యువకుడి మృతి!

Also Read: తాగినోళ్లకు తాగినంత...మందుబాబులకు రేవంత్‌ సర్కార్‌ అదిరిపోయే ఆఫర్‌!

Advertisment
Advertisment
తాజా కథనాలు