Terrorists: సరిహద్దులో కాల్పుల కలకలం.. ఇండియన్ ఆర్మీ సెర్చ్ ఆపరేషన్

పాక్ సరిహద్దు జమ్మూ కాశ్మీర్‌లో ఆదివారం కాల్పులు కలకలం రేపాయి. కథువా జిల్లా హిరానగర్ సెక్టార్‌లో భద్రతా దళాలు, ఉగ్రవాదుల మధ్య ఎన్‌కౌంటర్ జరిగింది. ఇందులో ముగ్గురు టెర్రరిస్టులు చనిపోయినట్లు తెలుస్తోంది. మిగిలిన వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.

New Update
J and K firing

J and K firing Photograph: (J and K firing )

పాక్ సరిహద్దు జమ్మూ కాశ్మీర్‌లో ఆదివారం కాల్పులు కలకలం రేపాయి. కథువా జిల్లా హిరానగర్ సెక్టార్‌లో భద్రతా దళాలు, ఉగ్రవాదుల మధ్య ఎన్‌కౌంటర్ జరిగింది. ఉగ్రవాదుల కదలికల గురించి నిఘా వర్గాల సమాచారం మేరకు, హిరానగర్‌లోని మన్యాల్ ప్రాంతంలో సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. అక్కడ అడపాదడపా కాల్పులు జరుగుతున్నాయని జవాన్లు తెలిపారు. ఇద్దరు నుంచి ముగ్గురు ఉగ్రవాదులను దళాలు మట్టుబెట్టినట్లు ప్రాథమిక నివేదికల ప్రకారం మేరకు తెలుస్తోంది. నలుగురు లేదా ఐదుగురు ఉగ్రవాదులు ఈ ప్రాంతంలోకి చొరబడి ఉండవచ్చని భద్రతా వర్గాలు తెలిపాయి.

Also read: SRH mems: SRH వైల్డ్ ఫైర్.. సోషల్ మీడియాలో మీమ్స్ పేల్చుతున్న ఫ్యాన్స్

Encounter Breaks Out Between Security Forces And Terrorists

Also Read :  ఇదెక్కడి ట్విస్ట్.. లూసిఫర్ 2 లో మోహన్ లాల్ రెమ్యునరేషన్ ఎంతంటే?

స్థానికంగా ఉన్న వారు తమ పంట పొలాల్లో ఆయుధాలతో అనుమానంగా కనిపించిన వెంటనే వారు భద్రతా దళాలకు సమాచారం ఇచ్చారు. దీంతో ఆర్మీ అధికారులు, జవాన్లు అనుమానితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. BSF, భారత సైన్యం, జమ్మూ మరియు కాశ్మీర్ పోలీసుల సిబ్బంది ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టి జాయింట్ ఆపరేషన్ ప్రారంభించారు.

Also read: నా కాల్ డేటా మొత్తం రికార్డ్ చేశారు.. దీని వెనుక ఉంది MP క్రిష్ణ దేవరాయలే : విడదల రజిని

Also Read :  సన్‌రైజర్స్ కు బిగ్ షాక్.. మహ్మద్ షమీకి గాయం!

 

firing | jawan | jammu-kashmir-news | jammu-kashmir-encounter | latest-telugu-news | today-news-in-telugu | national news in Telugu

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు