Police Notices: అల్లు అర్జున్‌కి మరో బిగ్ షాక్.. నోటీసులు జారీ
సంధ్య థియేటర్ ఘటనలో అల్లు అర్జున్‌కు పోలీసులు నోటీసులు జారీ చేశారు. రేపు ఉదయం 11 గంటలకు చిక్కడిపల్లి పోలీసు స్టేషన్‌కు హాజరు కావాలని పోలీసులు తెలిపారు. దీంతో ఉత్కంఠ నెలకొంది.
సంధ్య థియేటర్ ఘటనలో అల్లు అర్జున్‌కు పోలీసులు నోటీసులు జారీ చేశారు. రేపు ఉదయం 11 గంటలకు చిక్కడిపల్లి పోలీసు స్టేషన్‌కు హాజరు కావాలని పోలీసులు తెలిపారు. దీంతో ఉత్కంఠ నెలకొంది.
కిమ్స్ హాస్పిటల్ యాజమాన్యం శ్రీతేజ్ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. ప్రస్తుతం శ్రీతేజ్ ఆరోగ్యం నిలకడగానే ఉందని, వెంటిలేటర్, ఆక్సిజన్ లేకుండానే స్వయంగా ఊపిరి తీసుకోగలుగుతున్నాడని తెలిపింది. తనంతట తాను ఫుడ్ కూడా తీసుకోగలుగుతున్నాడని వెల్లడించింది.
సంగీత దర్శకుడు థమన్ తాజాగా తన సోషల్ మీడియాలో ఎన్టీఆర్, రామ్ చరణ్‌లతో కలిసి దిగిన ఒక ఫోటోను పంచుకున్నారు. దానికి..'దోప్ మూమెంట్.. వాట్ ఫన్. బ్రదర్స్ లవ్' అని క్యాప్షన్ పెట్టాడు. చరణ్, తారక్ లను చాలా రోజులకు ఒకే ఫ్రేమ్ లో చూసి ఫ్యాన్స్ తెగ ఖుషీ అవుతున్నారు.
సంధ్య థియేటర్ ఘటనపై సినీయర్ హీరోయిన్, కాంగ్రెస్ నేత విజయశాంతి స్పందించారు. ఈ ఘటన జరగడం దురదృష్టకరమని చెప్పిన ఆమె..రాజకీయ స్వార్థం కోసం ఈ ఘటనను ఉపయోగించేందుకు బీజేపీ నేతలు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఈ మేరకు ఆమె పెట్టిన పోస్ట్ హాట్ టాపిక్ గా మారింది.
'దేవర' రిలీజ్ కి ముందు జూనియర్ ఎన్టీఆర్.. క్యాన్సర్ తో పోరాడుతున్న తన అభిమానితో వీడియో కాల్ లో మాటాడిన విషయం తెలిసిందే. ఆ సమయంలో తారక్, అతని ట్రీట్మెంట్ కు సాయం చేస్తానని మాటిచ్చారు. కానీఎన్టీఆర్ నుంచి ఎలాంటి సాయం అందలేదని అభిమాని తల్లి మీడియాతో చెప్పారు.
అల్లు అర్జున్‌పై ఎమ్మెల్యే యెన్నెం శ్రీనివాస్ రెడ్డి సంచలన కామెంట్స్ చేశారు. 'అర్థరాత్రి పబ్బుల్లో, గోవాలో పార్టీలు చేసుకునే నీ కంటే సోనూ సూద్ నయం. సమంత, మంచులక్ష్మి ఎంతో ఆదర్శంగా ఉంటారు. తమిళ నటులకున్న సామాజిక సృహ మీకు ఎందుకు లేదు' అంటూ మండిపడ్డారు.
సంధ్య థియేటర్ ఘటనలో మృతి చెందిన బాధిత కుటుంబానికి 'పుష్ప2' నిర్మాణ సంస్థ అయిన మైత్రీ మూవీ మేకర్స్ ఆర్థికసాయం అందించారు. ఈ మేరకు నిర్మాత నవీన్ సోమవారం శ్రీ తేజ్ కుటుంబాన్ని పరామర్శించి, మృతురాలి కుటుంబానికి రూ.50లక్షల చెక్కును అందజేశారు.
బాలీవుడ్ సింగర్ భట్టాచార్య మహాత్మ గాంధీ పై చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. మహాత్మ గాంధీ పాకిస్థాన్ జాతిపిత.. భారతదేశానికి కాదు.. పొరపాటున ఆయనను జాతిపిత అని పిలిచారు అంటూ సంచలన కామెంట్స్ చేశారు.
సంధ్య థియేటర్ ఘటనపై తెలంగాణ ఫిలిం ఛాంబర్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఈ ఘటనలో బాధిత కుటుంబాన్ని ఆదుకునేందుకు విరాళాలు సేకరించేందుకు ముందుకొచ్చింది. బాలుడ్ని ఆదుకునేందుకు ఇండస్ట్రీ సభ్యులు ముందుకు రావాలని ఫిలిం ఛాంబర్ పిలుపునిచ్చింది.