ఆ నిర్మాత అడిగిన బడ్జెట్ ఇవ్వలేదు.. చాలా బాధేసింది : డైరెక్టర్ బాబీ

డైరెక్టర్ బాబీ తాజా ఇంటర్వ్యూలో ఓ సినిమా విషయంలో తాను చాలా బాదపడ్డానని అన్నారు. సినిమా పేరు బయటపెట్టకుండా తాను తీసిన ఆ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యిందని, కానీ ఆ సినిమాకు కావాల్సిన బడ్జెట్ నిర్మాత ఇవ్వలేదని చెప్పారు.ఆ సమయంలో చాలా బాధేసిందని తెలిపారు.

New Update
director bobby

director bobby

నందమూరి బాలకృష్ణ ప్రధాన పాత్రలో రూపొందుతున్న చిత్రం ‘డాకు మహారాజ్’. గత ఏడాది 'వాల్తేరు వీరయ్య' తో సూపర్ హిట్ అందుకున్న బాబీ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై నాగవంశీ ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో నిర్మించారు. 

ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమైంది. ఇటీవల విడుదలైన ఈ చిత్రంలోని రెండు పాటలు మంచి రెస్పాన్స్ అందుకున్నాయి. విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో, చిత్రబృందం ప్రమోషన్స్‌ను వేగవంతం చేసింది. ఈ క్రమంలో దర్శకుడు బాబీ పలు ఇంటర్వ్యూలు ఇస్తున్నారు.

చాలా బాధ పడ్డాను..

ఈ క్రమంలోనే ఒక మీడియా ఇంటర్వ్యూలో బాబీ చేసిన కొన్ని వ్యాఖ్యలు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి. ఆయన మాట్లాడుతూ.." నా కెరీర్‌లో ఒక సినిమాతో చాలా బాధ పడ్డాను. ఆ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. కానీ ఆ నిర్మాణ సంస్థ నేను అడిగిన బడ్జెట్ ఇచ్చి ఉంటే సినిమాను మరింత గొప్పగా తీర్చిదిద్దేవాడిని. కానీ  నేను అడిగిన బడ్జెట్ ఇవ్వలేదు. ఆ సమయంలో చాలా బాధేసింది.." అని చెప్పారు.

Also Read: అక్రమసంబంధాల్లో మహిళలే టాప్.. ఇండియాలో ఆ రాష్ట్రమే నెం.1

ఈ వ్యాఖ్యలపై నెటిజన్ల మధ్య చర్చలు మొదలయ్యాయి. కొందరు బాబీ ఈ వ్యాఖ్యలు ‘సర్దార్ గబ్బర్ సింగ్’ గురించి చేశారని భావిస్తుండగా, మరికొందరు ఇది ‘జై లవకుశ’ నిర్మాతను ఉద్దేశించి అన్నారనే అభిప్రాయపడుతున్నారు. 

సర్దార్ గబ్బర్ సింగ్ ప్లాప్ అయింది. కాబట్టి ఇది కచ్చితంగా 'జై లవకుశ' మూవీనే ఉంద్దేశించి అన్నాడనేది నెటిజన్ల వాదన.ఇదిలా ఉండగా, ‘డాకు మహారాజ్’ గురించి బాబీ ఎంతో ఉత్సాహంగా మాట్లాడారు.' ఈ చిత్రంతో బాలయ్యకు అతిపెద్ద హిట్ ఇస్తాను. ప్రేక్షకులు ఇప్పటివరకు చూడని కొత్త బాలయ్యను ఈ సినిమాలో చూస్తారు' అని అన్నారు. 

 

 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు