కోలీవుడ్ బ్యూటీ త్రిష తాజాగా చేసిన ఓ ఎమోషనల్ పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ పోస్ట్ నెటిజన్లను కదిలిస్తోంది. ఆ పోస్ట్‌లో తన పెంపుడు కుక్క జోరో మృతిచెందినట్లు వెల్లడించింది. గత 12 ఏళ్లుగా తనతో కలిసి ఉన్న జోరో ఈ క్రిస్మస్ ఉదయం చివరి శ్వాస విడిచింది. త్రిష జోరోను తన కంటికి రెప్పలా చూసుకుని, కన్నబిడ్డలా ప్రేమించింది. కానీ దురదృష్టవశాత్తూ, జోరో ఇక లేడన్న వార్త ఆమెను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ విషయాన్ని త్రిష ఎక్స్ వేదికగా పంచుకుంటూ తన బాధను వ్యక్తం చేసింది. pic.twitter.com/0r9ZUKGTxF — Trish (@trishtrashers) December 25, 2024 Also Read: యూపీలో దారుణం..పుట్టినరోజని పిలిచి బట్టలిప్పించి..మూత్రం తాగించారు బాధలో ఉన్నాం.. ఈ మేరకు పోస్ట్‌లో," క్రిస్మస్ రోజు తెల్లవారుజామున నా ప్రియమైన జోరో కన్నుమూశాడు. నా జీవితంలో జోరో స్థానాన్ని తెలిసిన వారందరికీ ఇది ఎంతగానో అర్థమవుతుంది. జోరో లేకపోతే నా జీవితం శూన్యం. నేను, నా కుటుంబం ఈ సమయంలో తీవ్ర దుఃఖంలో ఉన్నాము. ఈ షాక్ నుంచి కోలుకోవడానికి కొంత సమయం అవసరం. అందువల్ల సినిమాల నుంచి కాస్త విరామం తీసుకుంటున్నాను. కొన్ని రోజులు అందుబాటులో ఉండను," అంటూ పేర్కొంది. అలాగే తన పెంపుడు కుక్క జోరో ఫోటోలను సైతం షేర్ చేసింది. దీంతో త్రిష పెట్టిన ఈ పోస్ట్ వైరల్ గా మారింది. Zorro🪽2012-2024🌈 pic.twitter.com/9JHOB3RFNp — Trish (@trishtrashers) December 25, 2024 త్రిష సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం ఆమె వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. మెగాస్టార్ తో కలిసి 'విశ్వంభర' కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ తో విదాముయార్చి, గుడ్ బ్యాడ్ అగ్లీ.. కమల్ హాసన్ తో థగ్ లైఫ్ సినిమాలు చేస్తోంది. వీటిలో 'విదాముయార్చి' త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. Also Read: త్వరలో ఢిల్లీ సీఎం అరెస్ట్.. కేజ్రీవాల్ సంచలన ప్రకటన! View this post on Instagram A post shared by Trish (@trishakrishnan)