టాలీవుడ్ స్టార్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ ఇటీవల లైంగిక ఆరోపణల కేసులో జైలుకెళ్లిన సంగతి తెలిసిందే. సుమారు 20 రోజుల దాకా జైలులో ఉన్న ఆయన.. ఈ మధ్యే కండీషన్ బెయిల్ పై బయటికొచ్చారు. అయితే ఈ కేసు విషయంలో పోలీసులు తాజాగా జానీ మాస్టర్ కు షాక్ ఇచ్చారు. ఈ కేసులో ఛార్జ్‌షీట్ దాఖలు చేసిన పోలీసులు జానీ మాస్టర్ లైంగిక వేధింపులకు పాల్పడినట్లు నిర్ధారించారు. లేడీ కొరియోగ్రాఫర్‌పై లైంగిక దాడికి పాల్పడినట్లు పేర్కొన్నారు. ఈవెంట్స్ పేరుతో ఇతర ప్రాంతాలకు తీసుకెళ్లి జానీ మాస్టర్ లైంగిక దాడి చేశాడని ఛార్జ్ షీట్ లో పేర్కొన్నారు. దీంతో జానీ మాస్టర్ కు ఈ కేసు ఉచ్చులా బిగుసుకుంది. దీనిపై కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకోనుంది. ఆయన బెయిల్ ను రద్దు చేస్తుందా? లేదా? అనే అంశంపై ఉత్కంఠ నెలకొంది.