ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన ‘పుష్ప-2' డిసెంబర్ 5న థియేటర్లలో విడుదలై బాక్సాఫీస్ వద్ద అద్భుత విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. విడుదలైన మొదటి రోజే రికార్డ్ బ్రేకింగ్ ఓపెనింగ్స్ అందుకున్న ఈ మూవీ ఇప్పటీకే ప్రపంచవ్యాప్తంగా రూ.1600 కోట్లకు పైగా వసూళ్లతో దూసుకెళ్తోంది.
ఇక హిందీ బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం సంచలన విజయాన్ని సాధించింది. ఇండియన్ సినిమా చరిత్రలో హిందీలో అత్యధిక నెట్ వసూళ్లు సాధించిన చిత్రంగా ‘పుష్ప-2’ నిలిచింది. నార్త్ లో ఈ చిత్రానికి భారీ ఆదరణ లభిస్తోంది. దక్షిణాది కన్నా హిందీ మార్కెట్‌లోనే భారీ వసూళ్లు సాధిస్తోంది. పుష్పరాజ్ పాత్రకు జాతీయ స్థాయిలో క్రేజ్ కొనసాగుతుండటంతో అక్కడి ఆడియన్స్ ముందే ఆన్ లైన్ లో టికెట్ బుక్ చేసుకుంటున్నారు.
Many theatres are forcing people to watch film #BabyJohn while they bought tickets for film #Pushpa2! Distributor Anil Thadani should take strict action against such theatres. While Ppl should file case against fraud @bookmyshow in consumer court. pic.twitter.com/yMRsrPm52k
— KRK (@kamaalrkhan) December 25, 2024
ఇది కూడా చదవండి: సీఎం రేవంత్‌ను కలవను.. అల్లు అర్జున్ సంచలన నిర్ణయం!
'పుష్ప2' బదులు 'బేబీ జాన్'..
అయితే, తాజాగా 'పుష్ప-2’ కోసం టికెట్లు బుక్ చేసుకున్న అభిమానులకు నిరాశ ఎదురైంది. షో టైమ్‌లో థియేటర్‌కు వెళ్లిన ప్రేక్షకులు అక్కడ ‘పుష్ప-2’ బదులుగా బాలీవుడ్ మూవీ ‘బేబీ జాన్’ ప్రదర్శించడాన్ని గమనించారు. ఈ ఘటనపై అల్లు అర్జున్ ఫ్యాన్స్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. థియేటర్ యాజమాన్యం తీరుపై నిరసన తెలియజేస్తూ, అక్కడే ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ సంఘటనకు సంబంధించిన వీడియోని ప్రముఖ సినీ విమర్శకుడు కమల్ ఆర్ ఖాన్ (కేఆర్‌కే) తన సోషల్ మీడియా అకౌంట్‌లో షేర్ చేయడంతో, అది నెట్టింట వైరల్ అవుతోంది. ఇక ‘బేబీ జాన్’ సినిమా విషయానికొస్తే.. బాలీవుడ్ స్టార్ వరుణ్ ధావన్ ప్రధాన పాత్రలో ఈ సినిమా తెరకెక్కింది. ఇందులో కీర్తి సురేశ్ హీరోయిన్‌గా నటించగా, కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ కథను అందించారు.