సంధ్య థియేటర్ తొక్కిసలాటలో గాయపడి ప్రస్తుతం కిమ్స్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న శ్రీతేజ్ ను అల్లు అరవింద్ పరామర్శించారు. బాధితురాలి కుటుంబానికి రూ.2 కోట్ల ఆర్థిక సాయం అందించారు. అందులో అల్లు అర్జున్ కోటి రూపాయలు, మైత్రీ నిర్మాతలు రూ.50 లక్షలు, సుకుమార్ రూ.50 లక్షల సాయం అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో అల్లు అరవింద్ మాట్లాడుతూ..' శ్రీతేజ్ ఇపుడు కోలుకుంటున్నాడు. వేంటి లేషన్ తీసేసారు. ఈ కుటుంబానికి 2 కోట్లరూపాయలు.. అల్లు అర్జున్ నుంచి కోటి రూపాయలు, 'పుష్ప' నిర్మాతలు 50 లక్షలు, సుకుమార్ గారు 50 లక్షల రూపాయల ను మొత్తం 2 కోట్ల రూపాయలను ఎఫ్ డీ సీ చైర్మెన్ దిల్ రాజు గారికి అందచేయడం జరిగింది..' అని అన్నారు. అనంతరం దిల్ రాజు సైతం బాలుడి ఆరోగ్యం మెరుగుపడుతుందని చెప్పారు.' నిన్నటి ఈరోజుకి శ్రీతేజ్ ఫాస్ట్ గా రికవర్ అవుతున్నారు. అల్లు అరవింద్, సుకుమార్, పుష్ప నిర్మాతలు 2 కోట్ల రూపాయలు ఇచ్చారు. ఆ అమౌంట్ అంతా భాస్కర్ కుటుంబానికి అందించడం జరుగుతుంది. రేపు 10 గంటలకు సీఎం రేవంత్ గారిని ఫిలిం ఇండస్ట్రీ సభ్యులు కలవబోతున్నాము. ఇండస్ట్రీకి ప్రభుత్వానికి వారధిగా ఉంటానని నన్ను పెట్టారు..' అంటూ చెప్పుకొచ్చాడు.