Tollywood: టాలీవుడ్‌తో చర్చ.. తెలంగాణ సర్కార్ నుంచి ప్రతిపాదనలు ఇవే!

టాలీవుడ్‌తో చర్చల్లో తెలంగాణ సర్కార్ నుంచి కొన్ని ప్రతిపాదనలు వచ్చినట్లు తెలుస్తోంది. మాదక ద్రవ్యాల నిర్మూళనకు, డ్రగ్స్‌కు వ్యతిరేకంగా సినీ పరిశ్రమ సహకరించాలి. కులగణన సర్వే ప్రచార కార్యక్రమంలో తారలు పాల్గొనాలి. వీటితో పాటు మరిన్ని ఉన్నాయి.

New Update
cm revanth and tollywood

cm revanth and tollywood

ఇవాళ సినిమా పెద్దలు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కలవబోతున్నారు. ఎఫ్‌డీసీ ఛైర్మన్ దిల్ రాజు ఆధ్వర్యంలో మరికాసేపట్లో పెద్దలు రేవంత్‌తో సమావేశం కానున్నారు. ఈ మేరకు ఇప్పటికే పలువురు కమాండ్ కంట్రోల్‌కు చేరుకుంటున్నారు. అయితే ఈ భేటీలో సర్కార్ తరపు నుంచి పలు ప్రతిపాదనలు వచ్చినట్లు సమాచారం. టాలీవుడ్‌తో చర్చల్లో తెలంగాణ సర్కార్ నుంచి కొన్ని ప్రతిపాదనలు వచ్చినట్లు తెలుస్తోంది.

ALSO READ: సైబర్ కేటుగాళ్ల కొత్త స్కామ్.. సిమ్‌ స్వాప్‌ చేసి రూ.7 కోట్లు కొట్టేశారు!

సర్కార్ నుంచి పలు ప్రతిపాదనలు

అందులో ఒకటి డ్రగ్స్‌కు వ్యతిరేకంగా, మాదక ద్రవ్యాల నిర్మూళనకు సినీ పరిశ్రమ సహకరించాలని సర్కార్ నుంచి ప్రతిపాదన వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

అలాగే రెండోది డ్రగ్స్‌కు వ్యతిరేకంగా హీరోలు, హీరోయిన్లు ప్రచార కార్యక్రమాల్లో కచ్చితంగా పాల్గొనాలంటున్నట్లు సమాచారం.

ALSO READ: డెడ్ బాడీ పార్శిల్ కేసులో బిగ్ ట్విస్ట్.. శవం దొరకలేదని అమాయకుణ్ని హతమార్చారు?

ఇక మూడో ప్రతిపాదన.. సినిమా టికెట్లపై విధించే సెస్సును రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ నిర్మాణానికి వినియోగించాలన్నట్లు సమాచారం.

అలాగే నాల్గవ ప్రతిపాదన సినిమా టికెట్ రేట్ల పెంపు ఉండకపోవచ్చు.

ఇక ఐదవది కులగణన సర్వే ప్రచార కార్యక్రమంలో తారలు సహకరించాలి అనే ప్రతిపాదన వచ్చినట్లు సమాచారం.

ALSO READ: కామారెడ్డిలో విషాదం..ఒకేసారి మహిళా కానిస్టేబుల్‌, కంప్యూటర్‌ ఆపరేటర్‌ మృతి..ఎస్సై అదృశ్యం!

తాజా పరిణామాలపై చర్చిస్తాం: దిల్ రాజు 

నిన్న (బుధవారం) దిల్ రాజు స్పందిస్తూ తాజా పరిణామాలపై చర్చిస్తామన్నారు. ఇటు తెలంగాణ ప్రభుత్వం, అల్లు అర్జున్ మధ్య సయోధ్య కుదిర్చేందుకు ప్లాన్ చేస్తున్నారు. సమస్యను వీలైనంత త్వరగా సద్దుమణిగేలా సీఎంతో చర్చిస్తామని, తమనుంచి అన్ని విధాల సహాకారం అందించేందుకు సిద్దంగా ఉన్నామని దిల్ రాజు తెలిపారు. అలాగే బాధిత కుటుంబానికి ఆర్థికంగా అండగా నిలుస్తామని ఇప్పటికే ప్రకటించగా.. శ్రేతేజ్ కోలుకోవడం ఊరటకలిగించే అంశమని చెప్పారు.

ALSO READ: మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఇకపై క్యూ లైన్‌కు స్వస్తి!

అలాగే సంధ్య థియేటర్ ఘటన తర్వాత రాష్ట్రంలో బెన్ ఫిట్ షోలు, టికెట్ల పెంపు నిర్ణయం ఉండదని ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో  రేవంత్ రెడ్డితో సినీ పెద్దల భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది. మరోవైపు ఆసుపత్రిలో ఉన్న శ్రీతేజ్, బాధితుల కుటుంబాన్ని అల్లు అరవింద్, దిల్ రాజు పరామర్శించారు. బాధిత కుటుంబానికి అల్లు అర్జున్, దర్శకుడు సుకుమార్, నిర్మాత సంస్థ మైత్రిమూవీమేకర్స్ తరఫున రెండు కోట్ల రూపాయలు ఇవ్వబోతున్నట్లు ప్రకటించారు. 

Advertisment
తాజా కథనాలు