గంగమ్మ జాతరలో సీఎం చంద్రబాబు దంపతులు-PHOTOS
కుప్పంలో ఘనంగా జరుగుతున్న ప్రసన్న తిరుపతి గంగమ్మ జాతరలో సీఎం చంద్రబాబు సతీసమేతంగా పాల్గొన్నారు. అమ్మవారికి లాంఛనాలతో సారె సమర్పించారు. ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు.
కుప్పంలో ఘనంగా జరుగుతున్న ప్రసన్న తిరుపతి గంగమ్మ జాతరలో సీఎం చంద్రబాబు సతీసమేతంగా పాల్గొన్నారు. అమ్మవారికి లాంఛనాలతో సారె సమర్పించారు. ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక శాఖ ప్రధాన కార్యాలయం నిధి భవన్లో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. దీంతో విధులు నిర్వర్తిస్తున్న 300 మంది ఉద్యోగులు ఒక్కసారిగా బయటకు పరుగులు తీశారు. అయితే.. ఏసీలో షార్ట్ సర్క్యూటే ప్రమాదానికి కారణమని తెలుస్తోంది.
నారా లోకేష్ ను TDP ఎగ్జిక్యూటీవ్ ప్రెసిడెంట్ గా నియమించాలని చంద్రబాబు డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. ఈ నెల 27 నుంచి 29 వరకు నిర్వహించనున్న మహానాడులో ఈ మేరకు ప్రకటన చేసే అవకాశం ఉంది. ఇప్పటికే మహానాడుకు సంబంధించిన బాధ్యతలన్నీ లోకేష్ కే అప్పగించారు చంద్రబాబు.
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మనవడు హిమాన్షు తన స్నేహితులతో కలిసి మంగళవారం ఉదయం యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్నారు. వేద పండితులు తీర్థ ప్రసాదాలు అందించి ఆశీర్వదించారు. హిమాన్షు వెంట మాజీ ఎమ్మెల్యే సునీతా, బీఆర్ఎస్ నేతలు ఉన్నారు.
BJP అంటేనే బూతు జనతా పార్టీ అని.. ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. BJPని ప్రశ్నిస్తే దేశ ద్రోహులా? అని ధ్వజమెత్తారు. తప్పు ఎవరు చేసినా జైలుకు వెళ్లాల్సిందేనన్నారు. కాళేశ్వరం వ్యవహారంలో KCR నిజాయితీ నిరూపించుకుంటే పూలదండలు వేస్తామన్నారు.
హైదరాబాద్ లో 17 మందిని మింగిన గుల్జార్ హౌస్ ప్రమాదానికి సంబంధించిన ఫొటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. చనిపోయిన 17 మందిలో 8 మంది చిన్నారులే కావడం కంటతడి పెట్టిస్తోంది.
టీడీపీ కార్యకర్త రాజుపై దాడి కేసులో బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేష్ ను తుళ్లూరు పోలీసులు అరెస్ట్ చేశారు. నిన్న రాత్రి తనపై సురేష్ తో పాటు ఆయన సోదరుడు, బంధువులు దాడి చేసినట్లు రాజు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో సురేష్ ను అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది.
హైదరాబాద్లో ఉగ్రదాడికి పన్నిన కుట్రను పోలీసులు భగ్నం చేశారు. ఇక్కడ బ్లాస్టులు చేసేందుకు ప్లాన్ చేసిన ఇద్దరు నిందితుల్ని తెలంగాణ కౌంటర్ ఇంటలిజెన్స్ అధికారులు పట్టుకున్నారు.
సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలం గొల్లపల్లిలో అస్సాంకు చెందిన ఇస్లాం అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. నకిలీ సిమ్ కార్డులను పాకిస్తాన్ కు చెందిన వ్యక్తులకు అమ్మడం, ఇక్కడి నుంచి విలువైన సమాచారాన్ని అక్కడికి చేరవేయడం తదితర అభియోగాలు ఆయనపై ఉన్నాయి.