BRS - BRS: కవిత వివాదం.. బీజీపీలో బీఆర్ఎస్ విలీనం.. బీఆర్ఎస్ నేత వినోద్ సంచలనం!

బీఆర్ఎస్ పార్టీని బీజేపీలో విలీనం చేయడానికి ప్రయత్నించారంటూ ఈ రోజు కవిత చేసిన వ్యాఖ్యలను BRS నేత వినోద్ ఖండించారు. BJPతో ఇంత వరకు కనీసం పొత్తు కూడా పెట్టుకోలేదన్నారు. కవితలో అంత ఆవేదన ఉన్న విషయం ఇప్పుడే తెలిసిందన్నారు. వివాదం త్వరలోనే ముగుస్తుందన్నారు.

New Update
BRS Vs MLC Kavitha

Vinod Kumar Sensational Comments On Kavitha Issue

రాజకీయాల్లో ప్రకంపనలు సహజమని బీఆర్ఎస్ కీలక నేత, మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు. చాలా పార్టీల్లో ఇలాంటి  ప్రకంపనలు చూశామన్నారు. ఇందులో తమ పార్టీ మొదటిది కాదు.. చివరిది కాదని అన్నారు. కరుణానిధి, అళగిరి, కనిమొలి ఫ్యామిలీ రాజకీయాలు చూశామన్నారు. కవితలో అంత ఆవేదన ఉన్న విషయం ఇప్పుడే చూశానన్నారు. సమస్యలు త్వరలోనే ఖచ్చితంగా సద్దుమణుగుతాయన్నారు. బీఆర్ఎస్ పార్టీ టీడీపీ, కాంగ్రెస్, వామపక్ష పార్టీలతో కలిసి పనిచేసిందన్నారు. ఇంత వరకు ఒక్క బీజేపీతో మాత్రమే పని చేయలేదని గుర్తు చేశారు. బీజేపీతో కలిసి పనిచేయాలనుకుంటే ఎప్పుడో పొత్తు పెట్టుకునేవాళ్లమన్నారు. చిట్ చాట్ లో మాట్లాడిన అంశాలపై షోకాజ్ నోటీసు ఎలా ఇస్తాం? అని అన్నారు. కవితను కలిసి మాట్లాడే ప్రయత్నం చేస్తానన్నారు. కవిత వ్యాఖ్యలపై పార్టీలో చర్చ జరుగుతోందన్నారు. 

Also Read :  జూన్‌ 10 నాటికి జగన్‌ అరెస్టు ఖాయం.. విజయసాయి రెడ్డి సంచలన వ్యాఖ్యలు

Also Read :  తెల్లటి మచ్చలను వదిలించుకోవాలనుకుంటున్నారా? ఇలా చేయండి

Also Read :  పాకిస్తాన్‌తో అఫ్గనిస్తాన్ యుద్ధం.. భీకర కాల్పులు

Also Read :  రాష్ట్రంలో వాటిని అణిచివేయడానికి స్పెషల్ ఫోర్స్ ఏర్పాటు

telugu breaking news | telugu-news | kalvakuntla-kavitha

Advertisment
Advertisment
తాజా కథనాలు