అవమానించారు.. తండ్రి, తాత ఫొటోలతో హిమాన్షు ఎమోషనల్ ట్వీట్!

KCRను ఎగతాళి చేశారు.. బెదిరించారు.. అవమానించారని.. కానీ, ఆయన ఆత్మబలాన్ని ఎవ్వరూ వంచలేకపోయారని ఆయన మనవడు హిమాన్షు ఆసక్తికర ట్వీట్ చేశారు. తెలంగాణ కేవలం ఒక రాష్ట్రం కాదని.. మన ఆత్మగౌరవానికి చిహ్నమన్నారు. చరిత్ర ఎప్పటికీ మరిచిపోని పేరు KCR అని కొనియాడారు.  

New Update
Kalvakuntla Himanshu

Kalvakuntla Himanshu

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కుమారుడు, కేసీఆర్ మనవడు హిమాన్షు తన ఎక్స్ ఖాతాలో ఆసక్తికర ట్వీట్ చేశారు. అందరికీ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. దశాబ్దాల పోరాటం, వివక్ష, బాధలు, ప్రతీ నీటి చుక్క కోసం తపించి, మన మాండలికం మాట్లాడినందుకు ఉద్యోగాలు కోల్పోయిన రోజులు.. ఇవన్నీ తెలంగాణ అనుభవించిందన్నారు. ఎన్నో త్యాగాలు, అలుపెరగని పోరాటాలను తెలంగాణ చూసిందన్నారు. 2014లో కేసీఆర్ నాయకత్వంలో మనం మళ్లీ మన అస్థిత్వాన్ని తెచ్చుకున్నామన్నారు.

బెదిరించారు.. అవమానించారు..

25 ఏళ్ల క్రితం పోరాటాన్ని మళ్లీ రాజేసిన ఆ ధైర్యవంతుడి నాయకత్వంలో తెలంగాణ సాధ్యమైందన్నారు. కేసీఆర్ ను ఎగతాళి చేశారు.. బెదిరించారు.. అవమానించారన్నారు. కానీ ఆయన ఆత్మబలాన్ని ఎవ్వరూ దెబ్బతీయలేకపోయారన్నారు. "ఒక యుద్ధం ఓడిపోవచ్చు, కానీ యుద్ధమే ఇంకా మిగిలి ఉంది"  అని కేసీఆర్ అనేవారని గుర్తు చేశారు. ఆయన చెప్పినట్లే తెలంగాణ సాధించామన్నారు. తెలంగాణ కేవలం ఒక రాష్ట్రం కాదని.. మన ఆత్మగౌరవానికి చిహ్నమన్నారు. చరిత్ర ఎప్పటికీ మరిచిపోని పేరు కేసీఆర్ అని కొనియాడారు.  

Advertisment
Advertisment
తాజా కథనాలు